Kiara Advani : బోల్డ్ డ్రెస్సుతో మైండ్ బ్లాక్ చేసిన కియారా.. వామ్మో డ్రెస్సు ధర అన్ని లక్షలా ?

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా , టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతూ వస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ లుక్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఈమె ఫ్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసే విధంగా బోల్డ్ డ్రెస్సుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా ఆమె తన ఇంస్టాలో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఆమె బ్లూ డ్రెస్సులో కనిపించింది. ట్రెండీ వేర్ లో కుర్రకారుకు మతిపోగొడుతోంది. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. కరీనా కపూర్ ఖాన్ మరియు సుహానా ఖాన్ కూడా ఆమెతో పాటు షూటింగ్‌లో ఉన్నారు. కరీనా బ్లాక్ కోచర్‌లో అందంగా కనిపించగా, సుహానా ఎరుపు రంగు దుస్తులలో అబ్బురపరిచింది. కియారా మాత్రం బ్లూ డ్రెస్సులో అందరిని ఆకట్టుకుంది..

Kiara Advani's latest photos are viral.. And what is the price of the dress?
Kiara Advani’s latest photos are viral.. And what is the price of the dress?

కియారా వేసుకున్న డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా దీని ధర మాత్రం లక్షల్లో ఉంటుందని ఓ వార్త షికారు చేస్తుంది. కానీ నిజానికి దీని ధర రూ. 49,634 ఉంటుందని టాక్.. ఆ డ్రెస్సుకు తగ్గట్లు లైట్ మేకప్ లో కనిపించింది. మొత్తానికి అమ్మడు లుక్ అదిరిపోయింది.. ఆ డ్రెస్సులో కియారా ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది .. ఇక బాలీవుడ్ లో మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు