Mehareen Pirzada : మెరుపుల డ్రెస్సులో మతిపోగొడుతున్న మెహ్రీన్..

Mehareen Pirzada : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ ఫర్జా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది.. అయితే ఈ మధ్య పెద్దగా సినిమాల్లేక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. లేటెస్ట్ గా అదిరిపోయే డ్రెస్సులో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అతి చిన్న వయస్సులోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టిన పదేళ్ల వయసులో మొదటి ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.. 2016 లో నాని మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు లో వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది.. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి సినిమాలు మెహ్రీన్ కు భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి.. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్‌, పంజాబ్ భాషల్లో సైతం సినిమాల్లో యాక్ట్ చేసిన మెహ్రీన్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది..

Mehareen Pirzada latest photos viral in social media
Mehareen Pirzada latest photos viral in social media

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. ఇక సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా గ్రీన్ కలర్ మెరుపుల స్కిన్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి.. సినిమాల విషయానికొస్తే రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు