Pooja Hegde : చిరిగిన చొక్కాతో పూజా హెగ్డే.. ఇదేం స్టైల్ మామా..

Pooja Hegde : టాలివుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే పేరు అందరికీ తెలుసు. గత రెండేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేవు.. ప్రస్తుతం ఒక హిట్ సినిమా అయినా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. సినిమాలు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా, వరస ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి.. రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ సినిమా ఆఫర్ ను పట్టేసిందని తెలుస్తుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా చిరిగిన చొక్కాతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde's latest photos are viral on social media
Pooja Hegde’s latest photos are viral on social media

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్, ట్రెడిషన్‌ లుక్‌తో నెటిజన్లను కుదురుగా ఉండనివ్వదు. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో యువతను చూపుతిప్పుకోనియకుండా చేస్తుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది. చిరిగిన వైట్ చొక్కాలో దర్శనమిస్తుంది. ఫోటోలు వెరైటీగా ఉండటంతో ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆ ఫోటోలలో పాప ఎంత హాట్ గా ఉందో ఒక్కసారి ఇలా లుక్ వేసుకోండి..

Pooja Hegde's latest photos are viral on social media
Pooja Hegde’s latest photos are viral on social media

ఇకపోతే.. గత రెండేళ్ల క్రితం వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌ వంటి వారితోనూ కలిసి నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కానీ గతేడాది నుంచి ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి.. గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేసింది.. ఆ సినిమా అంత మాత్రంగానే రావడంతో ఐరన్ లెగ్ అనే టాక్ ను అందుకుంది. ఒక్క హిట్ సినిమా పడితే తప్ప మళ్లీ నిలదొక్కుకోవడం కష్టం అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు