Priyanka Jain.. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఈ సందర్భంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను అద్భుతంగా కృష్ణుడి గెటప్ లో తీర్చిదిద్దుతూ.. తమ పిల్లల్లో కృష్ణుడిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.. అబ్బాయిలకైతే కృష్ణుడి గెటప్, అమ్మాయిలకైతే గోపిక గెటప్ లు వేసి మైమరచిపోతుంటారు. అయితే ఇప్పుడు పిల్లలే కాదు పెద్దలు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణ రాధా గెటప్‌లలో అలరిస్తున్నారు.
రాధాకృష్ణుల్లా గెటప్ లో ప్రియాంక, శివ..
నిన్నటికి నిన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Thamannaah )రాధా గెటప్ లో అందరిని ఆకట్టుకుంది. కృష్ణుడి కోసం వేచిచూసే రాధలా తోటలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.తమన్నా అలా షేర్ చేసిందో లేదో మోడ్రన్ రాధా దిగివచ్చింది అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేశారు. అయితే ఈ ఫోటోల నుంచి ఇంకా అభిమానులు బయటపడక ముందే మరో సెలబ్రిటీ కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణల గెటప్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలను షేర్ చేశారు బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 లో తన అద్భుతమైన ఆట తీరుతో, విన్యాసాలతో, సాహసోపేతమైన టాస్క్‌లతో అలరించి , ఆకట్టుకున్నారు ప్రియాంక జైన్ (Priyanka Jain)
కృష్ణాష్టమి వేళ పరువు పోగొట్టుకున్నారుగా..
ఇకపోతే కృష్ణాష్టమి సందర్భంగా ప్రియాంక జైన్ తాజాగా రాధా గెటప్ లో ఆకట్టుకుంది. కానీ ఈమె ప్రియుడు శివకుమార్ గెటప్ చూస్తే మాత్రం కామెడీగా అనిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేమలు సినిమాలో ఒక కమెడియన్ వేసిన కృష్ణుడి గెటప్ ను తలపిస్తోంది ప్రియాంక బాయ్ ఫ్రెండ్ కృష్ణుడి గెటప్. దీన్ని చూసి అసలు వీడు కృష్ణుడు ఏంటి..? ప్రేమలు సినిమాలో కమెడియన్ కంటే దారుణంగా ఉన్నాడు.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే కృష్ణుడి గెటప్ లో నటుడు శివకుమార్ పరువు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
ప్రియాంక జైన్ కెరియర్..
ఇక ప్రియాంక జైన్ కెరియర్ విషయానికి వస్తే.. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తనదైన ఆట తీరుతో ఆకట్టుకొని టాప్ 5 లో నిలిచింది. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చి సింపుల్ గా పెళ్లి చేసేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. తన ప్రియుడు అలాగే నటుడు అయిన శివకుమార్‌తో ప్రియాంక పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి .అయితే ఇది నిజమని అందరూ అనుకున్నారు కానీ అంతలోపే ఇది ఒరిజినల్ కాదని , ఒక టీవీ షోలో భాగంగా వీరికి ఫేక్ పెళ్లి చేయడం జరిగింది అంటూ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
శివ కుమార్ తో సహజీవనం..
ఇకపోతే పలు సినిమాలు , సీరియల్స్ , షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి ఆకట్టుకుంటున్న ఈమె ప్రస్తుతం తన ప్రియుడు శివకుమార్ తో కలిసి రిలేషన్ లో ఉంది. అంతేకాదు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఇక తరచూ వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రాధాకృష్ణ గెటప్ లో కనిపించారు ప్రియాంక జైన్ , శివకుమార్.