Rakul Preet Singh: జిమ్ లో చెమటోడుస్తూ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రకుల్..!

Rakul Preet Singh.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ భాషా చిత్రాలలో నటించి.. హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో ప్రముఖ నటుడు , నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నది. ఇదిలా ఉండగా.. తన భర్త నిర్మాత కావడం చేత కొన్ని సినిమాలను తెరకెక్కించి, కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయారని గత కొద్దిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ ఏ మాత్రం పట్టించుకోకుండా తన భార్య రకుల్ ప్రీతిసింగ్ తో కలిసి జాకీ విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Rakul Preet Singh: Rakul is sweating in the gym and suffocating with beauty..!
Rakul Preet Singh: Rakul is sweating in the gym and suffocating with beauty..!

వర్కౌట్స్ చేస్తూ అందచందాలతో చెమటలు పట్టిస్తున్న రకుల్..

రకుల్ ప్రీత్ సింగ్ కి వివాహమైన తర్వాత చాలా ఫ్రీడమ్ వచ్చేసినట్టుంది. తన భర్త జాకీ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నదీ తీర ప్రాంతంలో జాలీ గా ప్రకృతి నీ ఆస్వాదిస్తూ ఉన్నట్లుగా కొన్ని ఫోటోలను, వీడియోలను సైతం షేర్ చేసింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్విమ్ సూట్ ధరించి నదిలో స్విమ్మింగ్ చేస్తున్న ఒక వీడియో షేర్ చేసింది. అంతేకాదు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడి పోతున్నట్టు అనిపించింది. పైగా చెమటలు చిందిస్తూ తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది అని చెప్పవచ్చు.

భర్తతో విహార యాత్రలు చేస్తున్న రకుల్..

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చింది..”ఈవారం ఇప్పుడే ప్రయాణించాము.. తన బెస్ట్ అయినటువంటి జాకీ తో ఇలా ఆనందంగా గడపడం చాలా ఆనందంగా ఉంది అంటూ రకుల్ ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే ఈ ఫోటోలకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో సహా పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. రకుల్ ఇటీవలె భారతీయుడు-2 చిత్రంలో నటించినప్పటికీ ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు పెద్దగా అందుకోలేకపోతోంది ముద్దుగుమ్మ.

- Advertisement -

బాలీవుడ్ కే పరిమితం..

తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన రకుల్ ఒక్కసారిగా కనుమరుగయ్యి బాలీవుడ్ వైపుకు అడుగులు వేసింది. అక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో నటించినా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతోంది. మరి వివాహమైన తర్వాత అయినా ఈ ముద్దుగుమ్మ కెరియర్ మారుతుందేమో అని అభిమానులు ఆరాటపడుతున్నారు కానీ ఇప్పటివరకు ఈమెకు సినిమాలలో అవకాశాలు లభించలేదు. మరి భవిష్యత్తులోనైనా ఈమెకు అవకాశాలు వస్తాయి ఏమో చూడాలి మరి.. అభిమానులైతే తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందా.. లేక బాలీవుడ్ కి పరిమితం అవుతున్న అన్నది తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు