Y.Vijaya: ఈ సీనియర్ నటి కూతుర్ని చూశారా.. ఈమె అందం ముందు ఎవరైనా ఫిదా..!

Y.Vijaya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఒక వెలుగు వెలిగిన వై.విజయ (Y.Vijaya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా నాటి ప్రేక్షకులకే కాదు నేటి యువతకి కూడా ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎఫ్2 , ఎఫ్3 చిత్రాలతో భారీ క్రేజ్ దక్కించుకున్నారు వై.విజయ. తన రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో దాదాపు 1000కి పైగా చిత్రాలలో నటించారు. అందం , అభినయంతో ఆకట్టుకున్న ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు అంటే అగ్ర హీరోల పక్కన నటించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ముఖ్యంగా వెండితెరపై ఈమెను అందరూ చేపల పులుసు అని పిలుస్తారు.

Y.Vijaya: Have you seen this senior actor's daughter?
Y.Vijaya: Have you seen this senior actor’s daughter?

చేపల పులుసుగా గుర్తింపు..

అయితే ఇలా పేరు రావడానికి కూడా కారణం ఉంది. మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య వంటి సినిమాలలో చేపలు పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే పాత్రలు ఆమె కనిపించింది. ఇక అందుకే అందరూ ఆమెను చేపలు పులుసు అని పిలుస్తారు. తెలుగులోనే కాదు తమిళ్ , మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి 80వ దశకంలో వచ్చిన ఈమె వెయ్యికి పైగా చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్..

ఆ తర్వాత కొద్దికాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇటీవల మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బి ఏ.ఎల్ ఎల్ బీ, ఎఫ్2 , ఎఫ్3 సినిమాలలో కనిపించి నవ్వులు పూయించింది. అంతేకాదు కొన్ని సీరియల్స్ లో కూడా కనిపించింది. ఇకపోతే ఈమె సినిమాల పక్కన పెడితే , వైవాహిక జీవితంలో 1985లో అమలనాథన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అనుష్క అనే కూతురు కూడా జన్మించింది. ఈమె కూతురు అనుష్క ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2013 లోనే చెన్నైలో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి ప్రముఖులందరూ విచ్చేశారు. ముఖ్యంగా రాధికా, రమా ప్రభ , శారద , శ్రీ ప్రియ, బాలచందర్ , సుహాసిని ఇలా చాలామంది విజయ కూతురు పెళ్లి వేడుకలో మెరిసారు

- Advertisement -

వై విజయ కూతుర్ని చూశారా..

ఇకపోతే తాజాగా వై. విజయ తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈమె కూతురు చూడడానికి అచ్చం తల్లి లాగే ఉంది. అందం లో తల్లికి తగ్గ కూతురి అనిపించుకుంటుంది అనుష్క. ప్రస్తుతం ఈ తల్లి కూతుర్లకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. లేకపోతే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న ఈమె తన కూతుర్ని మాత్రం ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉంచింది అనే విషయాలు అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వై.విజయ ఈ విషయాలపై స్పందిస్తుందా లేక వదిలేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు