Yukti Thareja : దుబాయ్ షేక్ లా ఫోజిస్తున్న నాగశౌర్య హీరోయిన్!

Yukti Thareja : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ‘యుక్తి తరేజా’ ఒకరు. ఎంతో మంది హీరోయిన్ల లాగానే ఈమె కూడా ఈ గ్లామర్ ఫిల్డ్ లో రాణించాలని టాలీవుడ్ లోనే ఫస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఇదే ఈ భామకు తొలి సినిమా. కానీ ఈ సినిమాతో సక్సెస్ మాత్రం కొట్టలేకపోయింది. అందుకే మరో అవకాశం కోసం కూడా ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. నిజానికి హిందీలో ఇమ్రాన్ హష్మీతో ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో ముందు నటించింది యుక్తి. ‘లుట్ గయే’ అనే పేరుతో రిలీజ్ అయిన ఆ పాట యూట్యూబ్ లో ఏకంగా 1.3tb వ్యూస్ కొట్టింది. అయినా ఈ అమ్మాయికి ఎక్కడా ఛాన్సులు రాలేదు. చివరికి మళ్ళీ టాలీవుడ్ నుండే అవకాశం దక్కించుకుంది.

Yukti Thareja latest pics viral on social media

తెలుగు సినిమాతో మరోసారి..

ఇక యుక్తి తరేజా (Yukti Thareja) కు సక్సెస్ రాకపోయినా, మరోసారి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త సినిమా ‘కింగ్ జాకీ క్వీన్’ లో యుక్తి థేరేజా హీరోయిన్ గా నటిస్తుంది. కేకే అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దసరా లో హీరో ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక యుక్తి తరేజా రంగ బలిలో నటించి తన గ్లామర్ తో మెప్పించినా సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే సోషల్ మీడియాలో ఫాలోవర్లు మాత్రం పెరిగారు. పైగా అప్పుడప్పుడూ సౌత్ లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి చేసింది. ఇదిలా ఉండగా తాజాగా నెట్టింట షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

దుబాయ్ షేక్ లా ఫోజిస్తున్న యుక్తి తరేజా..

ఇక తాజాగా నెట్టింట షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఓ పిక్ లో దుబాయ్ షేక్ లా ఎడారిలో నిల్చొని, తలకు షేక్ ల గుడ్డ కట్టుకుని, చేతిపై గద్ద ని పట్టుకుని నిల్చుంది. అలాగే ఓ బీచ్ లో నిల్చుని ఉన్న ఫోటో, ఒక మేకప్ వేసుకుంటున్న పిక్ ని షేర్ చేసింది. అయితే సినిమాల్లో బిజీగా లేకపోయినా ఫోటోషూట్లతో ఎప్పుడూ నెట్టింట హడావిడి చేస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు