జ‌య‌మ్మ పంచాయ‌తీ నుంచి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

‘జయమ్మ పంచాయితీ’ మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా చిత్రం యూనిట్ ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు. వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా వుందీ పాట. చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు. కథలో కీలకమైన సందర్భంలో ఈ పాట ఉండబోతుందని సాహిత్యం వింటే అర్ధమౌతుంది. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాన్ని, ఆ పాత్రలోని ఎమోషనల్ కోణాన్ని ఈ పాట ఆవిష్కరించింది.

దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనూష్ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -

వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.

తారాగణం: సుమ కనకాల
సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: అనూష్ కుమార్
ఎడిటర్: రవితేజ గిరిజాల
నిర్మాత: బలగ ప్రకాష్
సమర్పణ: శ్రీమతి విజయ లక్ష్మి
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
ఆర్ట్: ధను అంధ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ – అఖిల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్స్: హరి ప్రియ
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ పీఆర్: మనోజ్ వల్లూరి
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు