Buddy Movie Review : బడ్డీ మూవీ రివ్యూ

Buddy Movie Review : అల్లు శిరీష్ కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏవీ సక్సెస్ కావడం లేదు. పోనీ వరుసగా సినిమాలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. అందుకే అతనికి మార్కెట్ కూడా స్టేబుల్ గా లేదు. తాజాగా అతను ‘బడ్డీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. మరి ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి…

కథ :

ఆదిత్య (అల్లు శిరీష్) పైలెట్ గా పనిచేస్తుంటాడు. ఓసారి ఇతనికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో పని చేస్తున్న పల్లవి (గాయత్రి భరద్వాజ్) పరిచయం అవుతుంది. గాయత్రిని ఆదిత్య చూడడు. కాబట్టి ఆమె ఎలా ఉంటుందో అతనికి తెలీదు. ఆదిత్యని పల్లవి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. అయితే ఊహించని విధంగా.. పల్లవి వల్ల ఆదిత్య సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది. మరోపక్క పల్లవి ఇంటర్నేషనల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠాకి చిక్కుతుంది. వాళ్ళ నుండి తప్పించుకుంటున్న టైములో ఆమె రౌడీల వల్ల గాయపడుతుంది. తరువాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది అని వైద్యులు తెలుపుతారు. కానీ ఆమె ప్రాణాలతో ఉండగానే శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆమె ఆత్మ ఓ టెడ్డీలోకి వెళ్తుంది. అది సస్పెన్డ్ అయ్యి ఆదిత్య వద్దకి వెళ్తుంది. ఆ టెడ్డిలో ఉన్నది పల్లవి అని ఆదిత్యకి తెలీదు. వీళ్ళిద్దరూ కలిసి ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠా లీడర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్ అమీర్) ని ఏం చేశారు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

ఆర్య, సాయేషా జంటగా నటించిన ‘టెడ్డీ’ సినిమా డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాని కొంచెం మార్చేసి, తెలుగు వాళ్ళ కోసం కామెడీ డోస్ పెంచి ‘బడ్డీ’ గా తీశారు. సింపుల్ గా చెప్పాలంటే ‘బడ్డీ’.. రీమేక్ ఆఫ్ బడ్డీ అనొచ్చు. కానీ మేకర్స్ ఇది రీమేక్ కాదు అంటూ కవర్ చేశారు. ఆ మాట వాళ్ళు అలా చెప్పడం వల్లో ఏమో కానీ, మొదటి నుండి ‘బడ్డీ’ ని కోడిగుడ్డుపై ఈకలు వెతికినట్టు చూస్తుంటారు ప్రేక్షకులు. వాస్తవానికి హీరోయిన్ కోమాలో ఉండగా ఆత్మ బయటకు రావడం అనే కాన్సెప్ట్ ‘ఎందుకంటే ప్రేమంట’ అనే సినిమా గుర్తుకొస్తుంది. అయితే అది హాలీవుడ్ సినిమా ‘జస్ట్ లైక్ హెవెన్’ నుండి తీసుకున్నది. టెడ్డీ టీం జస్ట్ ఆ లైన్ ని మాత్రమే తీసుకుని.. దానికి కొత్త పాయింట్ జోడించారు. కానీ మన ‘బడ్డీ’ టీం మాత్రం ‘టెడ్డీ’ ని యాజ్ ఇట్ ఈజ్ దించేశారనే చెప్పాలి.

- Advertisement -

‘టెడ్డీ’ చూడని వాళ్ళకైతే.. ‘బడ్డీ’ మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంటుంది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా.. అది సీరియస్ డ్రామాకి అడ్డుపడినట్టు అనిపిస్తుంది. దర్శకుడు సామ్ యాంటన్ మనస్ఫూర్తిగా ఈ సినిమాకి డైరెక్షన్ చేసినట్టు లేదు. కొన్ని సీన్స్ కి ముందు సీన్ తో సంబంధం లేనట్టు ఉంటుంది. కృష్ణన్ వాసంత్ సినిమాటోగ్రఫీ ఓకే. హిపాప్ తమిజా మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. అల్లు శిరీష్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ తో మమ అనిపించేశాడు. అతను డైలాగులు చెబుతుంటే స్క్రిప్ట్ బట్టీ పట్టి అప్పగించినట్టు ఉంటుంది తప్ప.. మోహంలో ఎటువంటి హావభావాలు పలకవు. యాక్షన్ సీన్స్ లో కూడా ఇబ్బందిపడుతూనే నటించినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. టెడ్డీలో సాయేషా పోషించిన పాత్రనే ఇక్కడ గాయత్రి భరద్వాజ్ పోషించింది. విలన్ గా చేసిన అజ్మల్ అమీర్.. 2,3 రోజులు కాల్షీట్లే ఇచ్చినట్టు ఉన్నాడు. అతని పాత్ర కూడా కొన్ని సీన్స్ కే పరిమితమైన ఫీలింగ్ కలుగుతుంది. అలీ కామెడీ కొంతవరకు పర్వాలేదు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.

ప్లస్ పాయింట్స్ :

ప్రొడక్షన్ వాల్యూస్
కామెడీ(కొన్ని చోట్ల)

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
సెకండ్ హాఫ్

చివరిగా ‘బడ్డీ’ … ‘టెడ్డీ’ చూసిన వాళ్లకి పూర్తిగా బోర్ కొట్టేస్తుంది. చూడని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించొచ్చు. ‘టెడ్డీ’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అందుబాటులో ఉంది కాబట్టి.. అది చూస్తే.. బడ్డీ కోసం థియేటర్ కి వెళ్లనవసరం లేదు

రేటింగ్ : 1.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు