Bahishkarana Web Series Review : బ‌హిష్క‌ర‌ణ వెబ్ సిరీస్ రివ్యూ..

Bahishkarana Web Series Review : తెలుగు హీరోయిన్ అంజలి వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. అది టైటిల్ కు తగ్గట్లే ఉందని తెలుస్తుంది.. ఈ సీరీస్ తో అంజలి హిట్ కొట్టిందా .. అసలు ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్యా నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సిరీస్ నేటి నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సిరీస్ ను ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. దీని టాక్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

కథ :

పక్కా గ్రామీణ కథతో దీన్ని తెరకెక్కించారు. పెద్దపల్లి అనే గ్రామంతో పాటుగా , చుట్టూ ఉన్న పది గ్రామాలకు శివయ్య (రవీంద్ర విజయ్ ) పెద్దగా ఉంటాడు. ఆయన చెప్పిందే వేదం అని ఆ గ్రామాల్లో ప్రజలు నమ్మేవారు. ఆయనను వెతుక్కుంటూ వస్తుంది పుష్ప (అంజలి ). పుష్ప అంటే ఒక వేశ్య.. ఆమె అందాలకు ఆకర్షితుడైన ఆయన ఆమెకు షెల్టర్ ఇవ్వడంతో పాటుగా ఆమెకు కావలసిన పనులను దగ్గరుండి తానే చూసుకునేవాడు. అయితే శివయ్య దగ్గర పనిచేసే దర్శి అనే వ్యక్తికి పుష్ప బాగా నచ్చేస్తుంది. ఇక అతను ఆమెను ప్రేమగా చూసుకొనేది . ఆలా ఇద్దరు మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం శివయ్య అనుమతిని కూడా తీసుకుంటాడు. పెళ్లి షాపింగ్ కోసం దర్శి పట్టణం పోయి వస్తాడు. వస్తూనే శివయ్య దర్శికి షాక్ ఇస్తాడు. దర్శి మరదలు లక్ష్మీ మేడలో తాళి కట్టమని ఆజ్ఞాపిస్తాడు. దాంతో లక్ష్మి మేడలో దర్శి తాళి కడతాడు. ఆ తర్వాత దర్శి కులపు అమ్మాయిలు మాయం అవ్వడమే , చనిపోవడంతో జరుగుతుంది. ఇక దర్శిని పోలీసులు అరెస్ట్ చేస్తారు .. దర్శి వదిలేసిన తర్వాత పుష్ప ఏమైంది? దర్శి జైలు నుంచి వచ్చాక పుష్పను కలుస్తాడా ? అన్నది వెబ్ సిరీస్ కథ..

- Advertisement -

విశ్లేషణ :

ఈరోజుల్లో కులాల గురించి పెద్దగా జనాలు పట్టించుకోలేదు.. కానీ అప్పట్లో మాత్రం పట్టింపులు ఎక్కువే .. అప్పట్లో కొన్ని గ్రామాల్లో తక్కువ కులం వాళ్ళను దూరంగా ఉంచేవారు. అంతేకాదు వారితో తమ పనులు చేయించుకొని ఎతోకొంత డబ్బులు ఇచ్చేవారు.. ఆ నేపథ్యంలో కొన్ని కథలు, సినిమాలు వచ్చాయి. అలాంటి కొత్త కథతోన ఈ బహిష్కరణ వచ్చింది.. పెద్ద కులం మనుషులకు ముట్టుకోవడానికి, ఇంట్లోకి రానివ్వడానికి అడ్డొచ్చిన కులం… అమ్మాయిల్ని తమ పక్కలోకి రానివ్వడానికి, పడక సుఖం అనుభవించడానికి ఏ మాత్రం అడ్డు రాకపోవడం గమనార్హం..ఈ సీరీస్ కథలో కీలకమైన అంశం అదొక్కటే కాదు, ఈడొచ్చిన అమ్మాయిలు వయసు మీరిన మృగాళ్ల నుంచి ఎదుర్కొంటున్న ఓ సమస్యను కూడా ప్రస్తావించారు. హీరో ప్రతీకారంలో అదొక కీలకమైన అంశం.. దీని కథ కొత్తగా ఉందని చెప్పలేం.. తర్వాత ఎపిసోడ్లలో ఏదైనా కొత్తగా చూపిస్తారేమో చూడాలి.. ముఖేష్ ప్రజాపతి కొన్ని సన్నివేశాలను తీసిన విధానంలో రా అండ్ రస్టిక్ ఫీల్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పలు సన్నివేశాల్లో అంతర్లీనంగా ఆయన కొన్ని విషయాలు చెప్పిన తీరు బావుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనుషులు చేపల్ని వేటాడినట్టు బలవంతులు బలహీనులను వేటాడుతున్నారని చూపే సన్నివేశం గానీ, పతాక సన్నివేశాల్లో గుడిసెలో భోజనాల దగ్గర సన్నివేశం గానీ చూసినప్పుడు డైరెక్టర్ బాగానే తీసాడని అనిపిస్తుంది..

అంజలి ఈ మధ్య ఇలాంటి పాత్రల్లోనే నటిస్తుంది.. ఆమె క్యారక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి.. కథ జనాలకు దగ్గరగా ఉండటంతో ఆదరణ లభిస్తుంది. డైరెక్టర్ అందరిని బాగానే వాడుకున్నాడు. కథకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. మరి అన్ని ఎపిసోడ్స్ ఇలాంటి టాక్ నే అందుకుంటాయా ? లేదా అనేది చూడాలి.. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ మంచి మెసేజ్ ను ఇచ్చింది . అన్ని వర్గాల వారికి ఇది బాగా నచ్చుతుంది ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు