Bujji and Bhairava Animated Series Review and Rating : బుజ్జి భైరవ రివ్యూ… ఇది కల్కి 2898ADకి ముందుమాట లాంటిది

Bujji and Bhairava Animated Series Review and Rating : మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితర దిగ్గజ స్టార్స్ కలిసి నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు కల్కి కథను అభిమానులకు అర్థమయ్యేలా చేయడానికి ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో దీనికి సంబంధించిన యానిమేషన్ సిరీస్ బుజ్జి అండ్ బైరవను విడుదల చేశారు మేకర్స్. మరి బుజ్జి అండ్ బైరవ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

కథ

బుజ్జి అండ్ బైరవ యానిమేషన్ సిరీస్ కాశీలో ఉంటున్న భైరవ (ప్రభాస్) చుట్టూ తిరుగుతుంది. అతను కాంప్లెక్స్ అనే ప్రదేశానికి వెళ్లాలని కలలు కంటాడు. ఒకసారి డంపింగ్ యార్డ్‌లో అతను రోబోటిక్ పరికరం అయిన బుజ్జిని కలుస్తాడు. బుజ్జి లక్ష్యం కూడా కాంప్లెక్స్‌కి వెళ్లడమే. ఈ ఇద్ద కలవడం, తరువాత వాళ్ళిద్దరినీ వెళ్లనుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళే కారు ఎలా తయారవుతుంది అనేది మిగతా కథ.

ఎలా ఉంది?

ఇటీవలి కాలంలో మనం చూసిన బెస్ట్ యానిమేటెడ్ సిరీస్‌లలో బుజ్జి అండ్ బైరవ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సిరీస్ వినోదాత్మకంగా చాలా బాగుంది. ప్రస్తుతానికి అమెజాన్ లో రిలీజ్ అయ్యింది కేవలం రెండు ఎపిసోడ్‌లు మాత్రమే. అయితే ఆ రెండు ఎపిసోడ్లు చూశాక మిగతా ఎపిసోడ్స్ ను కూడా మూవీ రిలీజ్ కావడానికంటే ముందు చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మూవీ లవర్స్.

- Advertisement -

B&b: Bujji & Bhairava Animated Prelude To Kalki 2898 Ad Will Stream On Prime Video In Over 240 Countries - Entertainment News: Amar Ujala - B&b Trailer:दो एपिसोड में बताई जाएगी 'बुज्जी

నిజానికి బుజ్జి అండ్ బైరవ సిరీస్ కల్కి 2898 ఏడీ మూవీ కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేసిన పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఈ సిరీస్ ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సినిమాని చూడటానికి ఆసక్తి చూపుతారు. బుజ్జి అండ్ భైరవ ఖచ్చితంగా కల్కి 2898 ఏడీకి హై బెంచ్‌మార్క్ సెట్ చేస్తుంది. ఈ సరదా సిరీస్ చూశాక కల్కిపై ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి.

ఇవే హైలెట్స్

యానిమేటెడ్ సిరీస్ ను భవిష్యత్ ప్రపంచంలో సెట్ చేశారు. ప్రభాస్ బహుమతులు గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ తన దగ్గర అధునాతన వాహనం లేకపోవడంతో అతను వాటిని సాధించడంలో విఫలమవుతాడు. ప్రభాస్ పాత్ర చాలా ఉల్లాసంగా, ఫన్నీగా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రభాస్ ఇంటి యజమానిగా బ్రహ్మానందం నటించగా, వీరిద్దరూ నటించిన సన్నివేశం కన్నుల పండువగా ఉంది. యానిమేషన్ సిరీసే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాము.

కల్కి 2898 ఏడీ కోసం అన్ని భాషల్లో బుజ్జి వాయిస్‌కి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. అలాగే యానిమేషన్ సిరీస్‌కి కూడా కీర్తి తన గాత్రాన్ని అందించింది. ఈ యానిమేషన్ సిరీస్ లో ఆమె వాయిస్ వినడానికి చాలా సరదాగా ఉంది.

bujji-and-bhairava-animated-series-review-and-rating
bujji-and-bhairava-animated-series-review-and-rating

మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు?

ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉన్న యానిమేటెడ్ సిరీస్ బుజ్జి అండ్ బైరవ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే యానిమేటెడ్ సిరీస్‌లో నాలుగు ఎపిసోడ్‌లు ఉన్నాయి. మొదటి రెండు ఎపిసోడ్‌లు ఇప్పటికే రిలీజ్ కాగా, జూన్ 27న సినిమా విడుదలైన తర్వాత మిగతా ఎపిసోడ్‌లు రిలీజ్ చేస్తారు.

రేటింగ్ : ఇది కల్కి 2898AD సినిమాకు ముందుమాట లాంటిది కాబట్టి… ఇప్పుడు దీనికి Filmify Telugu రేటింగ్ ఇవ్వాలని అనుకోవడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు