Demonte Colony2 Review : ‘డిమొంటీ కాలనీ 2’ రివ్యూ

Demonte Colony2 Review : ‘డిమోటీ కాలనీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు టీవీల్లో బాగా చూశారు. అందరూ మెచ్చుకున్నారు. 9 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా ‘డిమోటీ కాలనీ 2’ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అయితే ఇంప్రెస్ చేసింది. మరి ‘డిమోటీ కాలనీ 2’ … ‘డిమోటీ కాలనీ’ రేంజ్లో మెప్పించిందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

సామ్ అలియాస్ శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) మరణించి 6 ఏళ్ళు పూర్తవుతుంది.అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ విషయాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) డైజెస్ట్ చేసుకోలేదు. క్యాన్సర్ ను జయించిన అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అనేది ఆమెను వెంటాడే ప్రశ్న. మరోపక్క 6 ఏళ్ళకి ఒకసారి కొంతమంది అనుమానాస్పదంగా మరణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఓ లైబ్రరీ నుండి ఓ పుస్తకాన్ని చదువుకోవడానికి తీసుకెళ్లిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటారు. ఆ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? వాటిని ఆపడానికి డెబీ చేసిన ప్రయత్నాలు ఏంటి.? శ్రీనివాస్ (అరుళ్ నిధి), రఘునందన్ (అరుళ్ నిధి) లను ఆత్మహత్య చేసుకోకుండా ఈమె కాపాడిందా.? అన్నీ ఎలా ఉన్నా ‘డిమోటీ కాలనీ’ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే అది ఎలా? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘డిమోటీ కాలనీ 2 ‘ అని చెప్పాలి.

విశ్లేషణ :

దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు.. గత చిత్రం ‘కోబ్రా’ పెద్దగా ఆడలేదు. దీంతో అతనికి పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే అతన్ని దర్శకుడిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ‘డిమోటీ కాలనీ’ కి సీక్వెల్ చేశాడు. కథ మనం చెప్పుకోడానికి కొత్తగా ఉండొచ్చు. కానీ ఈ సినిమా చూడటానికి వెళ్ళేవాళ్ళు ముందుగా ‘డిమోటీ కాలనీ’ ని చూసి వెళ్తే ఈ సీక్వెల్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా హర్రర్ సినిమాలు ఒకేలా ఉంటాయి అనే విమర్శ ఉంది. కానీ రైటింగ్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద అవి కాసుల వర్షం కురిపించగలవు. ‘డిమోటీ కాలనీ’ కి ప్లస్ అయ్యింది అదే. సీక్వెల్ కి కూడా రైటింగ్ బాగా ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్, సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు థ్రిల్లింగ్ మూమెంట్స్ ని కూడా బాగా డిజైన్ చేశాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ మంచి హై ఇస్తుంది . సెకండాఫ్ లో అంతకు మించిన థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ క్లైమాక్స్ అయితే సాదా సీదాగా అనిపిస్తుంది. అక్కడి వరకు టాప్ లెవెల్ కి తీసుకెళ్లి చివర్లో రొటీన్ అనే ఫీలింగ్ కలిగించాడు దర్శకుడు. బాగా ఇన్వాల్వ్ అయ్యి చూసిన వాళ్లకి మాత్రమే అది లోటుగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు ఓకే గ్రాంటెడ్ అనేస్తారు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. హీరో అరుళ్ నిధి 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో బాగానే చేశారు. లుక్స్ పరంగా వేరియేషన్ కూడా చూపించడం జరిగింది.ప్రియా భవానీ శంకర్ కి తమిళంలో మంచి పాత్రలు దొరుకుతున్నాయి. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అనే అభిప్రాయం కలుగక మానదు.లుక్ పరంగా కూడా ఆమె కొత్తగా కనిపించిన సినిమా ఇది. అర్చనా రవిచంద్రన్ పర్వాలేదు అనిపించారు. ముత్తు కుమార్, సర్జనో ఖాలిద్ .. లు కూడా తమ నటనతో మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్

హర్రర్ ఎలిమెంట్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

క్లైమాక్స్ హడావిడిగా ముగించేయడం

చివరిగా.. ‘డిమోటీ కాలనీ2’ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని మిస్ చేయకూడదు.

రేటింగ్ : 2.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు