DoubleIsmart Twitter Review : డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ..

DoubleIsmart Twitter Review : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా ఎట్టకేలకు థియేటర్లలో ఈరోజు విడుదలైంది. ఎర్లీ మార్నింగ్ నుండే అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టగా, కాసేపటికిందే సినిమా ఫినిష్ అయింది. రామ్ – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.

DoubleIsmart Movie Twitter Review

కథ విషయానికి వస్తే..

ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ (DoubleIsmart) సినిమా కాసేపటికిందే థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. సినిమా చూసాక మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా కంప్లీట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా రామ్ (Ram pothineni) కి చిప్ ఫార్ములా కంటిన్యూ అవుతుంది. ముంబై డాన్ అయిన బిగ్ బుల్ దాదా తన ఓ పనిలో రామ్ మెమొరీ మార్చేసి, తమ మెమొరిని పెడదామని కిడ్నాప్ చేసి ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో జరిగే పరిణామాల మధ్యే డబుల్ ఇస్మార్ట్ కథ మొత్తం నడుస్తుంది. సినిమా ఆద్యంతం ఇస్మార్ట్ శంకర్ కథ కూడా గుర్తొస్తుంది.

- Advertisement -

పూరి మార్క్ మిస్ అయిందా..

ఇక డబుల్ ఇస్మార్ట్ లో రామ్ మరోసారి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ లో అదిరిపోయాడని చెప్పాలి. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మరోసారి మెప్పించడం ఖాయం. అలాగే ఈ సినిమాలో పాటలు థియేటర్లలో మాస్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి. మణిశర్మ పాటలు క్లిక్ అయినా, బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. అలాగే కావ్యా థాపర్ తో కెమిస్ట్రీ కూడా బాగుంది. తన రోల్ ఇస్మార్ట్ శంకర్ లో చాందినిని గుర్తు చేస్తుంది. అలాగే సినిమాలో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఇక ఆలీ కామెడీ ట్రాక్ అంతగా లేదు. కానీ పూరి జగన్నాథ్ (Puri jagannath) మార్క్ మాత్రం సినిమాలో మిస్ అయింది అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే స్క్రీన్ ప్లే బలం అంతగా లేనట్టు అనిపిస్తుంది. డ్యుయల్ సిమ్ మెమరీ చిప్ మార్చే కాన్సెప్ట్ అంతగా రాసుకోలేదని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్‌ గా, రామ్, పూరీ అభిమానులని మాత్రమే మెప్పించేలా అయితే ఉందని చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు