Evol Movie Review : సెన్సార్ బ్యాన్ చేసిన బో*ల్డ్ మూవీ ఎవోల్ రివ్యూ

Evol Movie Review : ఇటీవల కాలంలో బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఓటీటీలో ఆదరణ బాగానే పెరిగింది. ఇలాంటి సినిమాలు సెన్సార్ సమస్యల వల్ల థియేటర్లలోకి రావడం కష్టమే. ఒకవేళ వచ్చినా అందులో ఉండే కొన్ని రొమాంటిక్ సీన్స్ కు కత్తెర పడక తప్పదు. మరికొన్ని సినిమాలనైతే ఏకంగా సెన్సార్ బ్యాన్ చేసేస్తుంది. అలాంటి బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే ఎవోల్. ఈ మూవీకి రామ్ యోగి వెలగపూడి దర్శకత్వం వహించారు. అలాగే కథ, దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తానై ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్. పెళ్లి తరువాత ఎఫైర్ వంటి బోల్డ్ కంటెంట్ కు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ ను కలగలిపిన స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ఆహాలోకి వచ్చేసింది. మరి ఎవోల్ ఓటీటీ మూవీ లవర్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.

కథ

సినిమాలో నిధి అనే అమ్మాయి ప్రభును పెళ్ళాడుతుంది. అయితే తన భర్త ప్రభు బిజినెస్ పార్టనర్ అండ్ ఫ్రెండ్ అయిన రిషితో ఎఫైర్ పెట్టుకుంటుంది. మరోవైపు ప్రభు పెళ్ళికి ముందు నుంచే తన అసిస్టెంట్ అయిన ప్రశాంతి అనే అమ్మాయితో యవ్వారం నడిపిస్తుంటాడు. ఓరోజు ఇద్దరికీ ఉన్న ఎఫైర్స్ బయటపడతాయి. కట్ చేస్తే ప్రభు, అతని ఫ్రెండ్ రిషి కలిసి మందు కొడుతూ తమకున్న ఎఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చిన నిధి ఇద్దరినీ గన్ తో కాలుస్తుంది. అసలు హీరోయిన్ వాళ్ళిద్దరినీ ఎందుకు షూట్ చేయాలి అనుకుంటుంది? ఈ ముగ్గురి మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటి? చివరికి స్టోరీకి ఎలా ఎండ్ కార్డ్ పడింది? అనే విషయాలు తెలియాలంటే ఆహాలో ఈ సినిమాను చూడాల్సిందే.

EVOL' trailer sets high expectations

- Advertisement -

విశ్లేషణ

ఈ సినిమాలో నటించిన శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్, దివ్య శర్మ నటన పరంగా పర్వాలేదు అన్పించారు. కానీ విసుగు పుట్టించే స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ తడబడ్డాడు. EVOL అంటే రివర్స్ లో LOVE. సినిమా ఉపశీర్షిక ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్. అయితే సినిమాను చూశాక సెన్సార్ దీన్ని ఎందుకు బ్యాన్ చేసిందో అర్థం అవుతుంది. అర్థపర్థం లేని పచ్చి బోల్డ్ సీన్లతో సినిమాను నింపేశారు. అడల్ట్ కంటెంట్ తో సహ సినిమా చాలా వరకు బోర్ కొడుతుంది. సినిమాలో ఇల్లీగల్ ఎఫైర్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. కానీ అక్కడ కూడా కన్ఫ్యూజ్ చేశారు. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకున్నాడో ఆయనకన్నా అర్థం అయ్యిందా? అనే అనుమానం కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్మ్ నటీనటులు సినిమాకు ప్లస్ పాయింట్స్.

చివరగా

మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే చూడడం కష్టమే. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ మాత్రం కాదు. అలాగే సింగిల్ గా చూసినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తేనే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు