Harom Hara Movie Review : ‘హరోం హర’ మూవీ రివ్యూ

Harom Hara Movie Review : సరైన సక్సెస్ కోసం సుధీర్ బాబు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ముఖ్యంగా ‘హంట్’ ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు అతన్ని వెనక్కి నెట్టేశాయి.ఈ క్రమంలో ఎన్నో అసలు పెట్టుకుని ‘హరోం హర’ చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ :

కుప్పంలో తమ్మి రెడ్డి (కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్) ఓ పెద్ద గుండా. అతని తమ్ముడు బసవ రెడ్డి (రవి కాలె) పరమ దుర్మార్గుడు. అతని చూపు పడిన ప్రతి మహిళ ఆమె సొంతం అనుకునే నీచుడు. ఇలాంటి వారి చేతుల్లో నలిగిపోతూ ఉంటారు ఆ ఊరి జనాలు. అటువంటి కుప్పంలోకి సుబ్రమణ్యం (సుధీర్ బాబు) ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ కోసం వస్తాడు. అయితే ఓ రోజు తన కాలేజీలో ఓ స్టూడెంట్ ని తమ్మి రెడ్డి ఫ్యామిలీకి చెందిన ఇంకో స్టూడెంట్ కొట్టడానికి వెళ్తాడు. ఆ టైంలో సుబ్రహ్మణ్యం అడ్డుపడి సర్దిచెప్పాలని చూస్తాడు. కానీ తమ్మిరెడ్డి కుటుంబానికి చెందిన స్టూడెంట్ అలాగే అతని బ్యాచ్ సుబ్రహ్మణ్యం పై దాడి చేయాలని ప్రయత్నించి అతని చేతుల్లోనే తన్నులు తింటారు. దీంతో వారి ఇగో హర్ట్ అవుతుంది. అది కాస్త తమ్మిరెడ్డి కొడుకు సాగర్ వరకు వెళ్తుంది. ఈ క్రమంలో సాగర్ కాలేజీ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం జాబ్ తీసేయాలని లేదంటే కాలేజీ లేకుండా చేస్తానని బెదిరిస్తాడు.అలా సుబ్రహ్మణ్యం జాబ్ పోతుంది. మరోపక్క సుబ్రహ్మణ్యం తండ్రి చేసిన అప్పుల కారణంగా అతను కుప్పంలోనే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని స్నేహితుడు పళని(సునీల్) వల్ల పిస్తోల్ బ్లూ ప్రింట్ అతని కంట పడుతుంది. అసలే మెకానిక్ బ్యాక్ గ్రౌండ్ కి చెందిన వ్యక్తి కావడంతో గన్నులు తయారు చేయడం మొదలుపెడతాడు. మొదట విలన్ గ్యాంగ్ తోనే ఇతను బిజినెస్ చేయడం మొదలుపెడతాడు. కానీ తర్వాత విలన్ గ్యాంగ్ తోనే శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి దారితీసిన సందర్భాలు ఏంటి అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ :

ఓ మంచి కమర్షియల్ సినిమా చూసి చాలా రోజులైంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లడం మానేసింది అలాంటి సినిమాలు రాకపోవడం వల్లనే అని చెప్పాలి. ఇలాంటి టైం దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా ‘హరోం హర’ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. గతంలో ఇతను ‘సెహరి’ అనే సినిమా తీశాడు. దానికి ముందు కూడా ‘ప్లేయర్’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. చాలా మందికి ఈ విషయం తెలీదు. కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న ఈ దర్శకుడు ఓ మాస్ సినిమా తీసి మెప్పిస్తాడు అని ఎవ్వరూ ఊహించరు. అది కూడా సుధీర్ బాబుతో..! చెప్పాలంటే సుధీర్ బాబు సినిమాకి హిట్ టాక్ వచ్చినా మొదటి రోజు కోటి రూపాయల వసూళ్లు కూడా రావు. అయినా జ్ఞానసాగర్.. సుధీర్ తో ఈ మాస్ ప్రయత్నం చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. సరే.. ‘హరోం హర’ ఫస్ట్ హాఫ్ బాగుంది. చాలా స్పీడ్ గా ముగిసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీంతో ఇన్నాళ్టికి సుధీర్ బాబుకి మంచి సినిమా పడింది అని అంతా అనుకుంటారు. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి తేడా వచ్చింది. పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఈ సినిమా సాగుతుంది. క్లైమాక్స్ అయితే కె.జి.ఎఫ్, విక్రమ్..ల స్టైల్లోనే ముగుస్తుంది. బిజీయం, సినిమాటోగ్రఫీ సూపర్. పాటలు మాత్రం అంతగా ఎక్కవు. నిర్మాణ విలువలు ఓకే.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

సుధీర్ బాబు ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే అదరగొట్టేశాడు. అందుకే దర్శకుడు ఇతనికి నైట్రో స్టార్ ట్యాగ్ ను తీసేసి ‘నవ దళపతి’ అనే ట్యాగ్ ని కట్టబెట్టాడు.దానికి సుధీర్ బాబు పూర్తిగా అర్హుడేనా అంటే ప్రస్తుతానికి అది అనవసరం. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ వాడని ట్యాగ్ కాబట్టి ఓకే. ఇక సుధీర్ తర్వాత సునీల్ .. పళని పాత్రలో అదరగొట్టేశాడు. హీరోయిన్ మాళవిక శర్మ జస్ట్ ఓకే అన్నట్టు ఉంది. పోలీస్ గా కనిపించిన అక్షర గౌడ్.. కూడా జస్ట్ పాస్ మార్కులు వేయించుకుంటుంది అంతే..! మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

ఇంటర్వెల్

హీరో ఎలివేషన్ సీన్స్

మైనస్ :

సెకండాఫ్ లో ల్యాగ్ ఉండటం

రొటీన్ క్లైమాక్స్

మొత్తంగా..

‘హరోం హర’ ఫస్ట్ హాఫ్ పరంగా మెప్పిస్తుంది. సెకండాఫ్ కనుక దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి తీసుంటే.. కచ్చితంగా దీని ఫలితం మరో రేంజ్లో ఉండేది. ఏదేమైనా ఈ వీకెండ్ కి కచ్చితంగా ఒకసారి చూసే విధంగా ‘హరోం హర’ ఉంది అనడంలో సందేహం లేదు.

రేటింగ్ : 2.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు