Satyabhama Movie First Review : సత్యభామ మూవీ ఫస్ట్ రివ్యూ

Satyabhama Movie First Review :కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించక పోయినా కూడా కాజల్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. మగధీర సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. తర్వాత స్టార్ హీరోలతో సైతం నటించే అవకాశాన్ని పొందుకుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కొక్కరి ఒక్కో టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఒకప్పుడు శ్రీయ,అనుష్క, త్రిష వంటి ఎందరో హీరోయిన్స్ స్టార్ హీరోలతో సహా పనిచేసి మంచి హిట్స్ సినిమాలను అందుకున్నారు. ఇకపోతే యంగ్ హీరోస్ తో మాత్రమే కాకుండా చాలామంది స్టార్ హీరోస్ తో కూడా వర్క్ చేసి మంచి హిట్ సినిమాలు అందుకుంది కాజల్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు సరసన, బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్. అలానే దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా కాజల్ నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2. ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించింది.

ఇకపోతే రీసెంట్ గా అనే కాజల్ గౌతమ్ అనే వ్యక్తిను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ కి పెళ్లి అయింది అనే విషయం తెలియగానే చాలామంది నిరశపడ్డారు. చాలామంది ప్రేక్షకులను కాజల్ తన సినిమాలతో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలకు దాదాపు దూరమైపోతుంది అనుకున్న తరుణంలో, కాజల్ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా పేరు సత్యభామ. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా టాక్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ మాత్రమే బాగుంది అని, సెకండాఫ్ అంతగా ఎక్కట్లేదు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాలో కాజల్కు మాత్రం బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ కి ఇచ్చిన రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటూ సమాచారం వినిపిస్తుంది. ఇదే విషయం మనకు టీజర్ చూసినా కూడా అర్థమవుతుంది. మొత్తంగా ఈ సినిమా మాత్రం బిలో యావరేజ్ కంటెంట్ అని, షీ టీమ్స్ కి ఎలివేషన్ ఇచ్చే విధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రేక్షకులు ఈ సినిమాకి ఎటువంటి ఫలితాలను అందిస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు