Bharateeyudu 2 Movie Review : భారతీయుడు 2 మూవీ రివ్యూ

Bharateeyudu 2 Movie Review : 28 ఏళ్ల క్రితం భారతీయుడు అనే మూవీ వచ్చింది. అప్పడు అదో సంచలనం. సమాజాన్ని ఆలోచింపచేసిన మూవీ అది. ఆ సినిమా హీరో కమల్ హాసన్‌కు, డైరెక్టర్ శంకర్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే దానికి సీక్వెల్‌గా ఇప్పుడు భారతీయుడు 2 వచ్చింది. చాలా ఏళ్ల పాటు షూటింగ్ జరగడంతో పాటు స్టార్ నటీనటులు ఉండటంతో మంచి హైప్ ఉంది. అలాగే.. భారతీయుడు 3 కూడా వస్తుంది.. అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో అనే ఆసక్తి జనాల్లో పెరిగింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్ధాం…

కథ :

సమాజంలో జరిగే అన్యాయాన్ని యూట్యూబ్ లో చూపిస్తూ అవేర్నెస్ తెప్పించాలని అనుకుంటారు చిత్ర అరవిందన్ … (సిద్ధార్థ్) అండ్ టీం. దీని వల్ల కష్టాలు వస్తాయే తప్పా… ఎలాంటి ప్రయోజనం లేదు అని చిత్ర అరవిందన్‌తో దిశ (రకుల్ ప్రీత్ సింగ్) చెబుతుంది. అయితే, ఈ అవినీతి సమాజాన్ని సరి చేయడం తమ వల్ల కాదు… ఇండియన్ రావాల్సిందే అని #ComeBackIndian అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు చిత్ర అరవిందన్ అండ్ టీం. అది… తైవాన్‌లో ఉన్న ఇండియన్ / సేనాపతి (కమల్ హాసన్) వరకు వెళ్తుంది. అక్కడే ఓ అడ్డదారిలో కోట్లు సంపాదించిన అతన్ని చంపి… ఇండియాకు తిరిగి వస్తాడు హీరో. అప్పటికే సేనాపతిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహా) చూస్తుంటాడు.

సేనాపతి ఇండియా వచ్చి… సీబీఐ నుంచి తప్పించుకుని అవినీతి ఎలా అరికట్టాడు..? దానికి చిత్ర అరవిందన్ అండ్ టీం ఎలా సహాకరించింది..? దాని వల్ల వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సకలకళా వల్లభుడు (ఎస్ జే సూర్య) ఎందుకు సేనాపతిని చంపాలి అనుకున్నారు..? చివరికి సేనాపతిని బాబీ సింహా అరెస్ట్ చేశారా ? అనేది కథ.

- Advertisement -

విశ్లేషణ :

1996 లో విడుదలైన భారతీయుడు సినిమా సూపర్ హిట్ అయింది.
అలాగే శంకర్ నుంచి వచ్చే ప్రతీ సినిమా ఓ అద్భుతం.
అలాగే కమల్ హాసన్ రీసెంట్ సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

ఈ కారణాలతో ఈ రోజు విడుదలైన భారతీయుడు 2పై అంచనాలు పెట్టుకోవడం తప్పే కాదు.
కానీ, ఈ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేదు అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఓ టైంలో #GoBackIndian అని వస్తుంది. అది చూసిన తర్వాత నిజంగానే భారతీయుడు 2 రాంగ్ టైంలో వచ్చాడు అనిపిస్తుంది. 3 గంటల సినిమా అంటే… బోరు కొట్టడం కామన్. కానీ, మ్యూజిక్ తో గానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ తో గానీ, ఆడియన్స్ ను థియేటర్ లో కూర్చోబెట్టొచ్చు. కానీ, అది జరగలేదు.

ఇంకా చెప్పాలంటే… డైరెక్టర్ శంకర్ నుంచి కూడా.. ఆడియన్స్ ను థియేటర్స్ లో కూర్చోబెట్టే ప్రయత్నం సరిగ్గా జరగలేదు.

సినిమా ప్రారంభంలో… సిద్ధార్థ్ అండ్ టీం సమాజం గురించి ఫన్నీగా చేసే వీడియోలతో సినిమాలో ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు కూడా కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వకపోయినా… అక్కడ కూడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా… కమల్ వచ్చి అన్నింటినీ సెట్ చేస్తాడు అనుకుంటాం.. కమల్ ఎంట్రీ వరకు అంటే 30 నిమిషాల పాటు సాగదీతగా సాగిన సినిమా కమల్ ఎంట్రీ తర్వాత మరింత చప్పగా మారిపోతుంది.

ఫేస్ బుక్‌లో లైప్ పెట్టి స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్.. భారతీయుడి స్పీచ్ కాబట్టి.. గూస్బమ్స్ వస్తాయని అనుకుంటాం. అక్కడా కూడా నిరాశే. అన్ని రాష్ట్రాల్లో అడ్డగోలుగా సంపాదించిన వాళ్లను పట్టుకుని చంపుతాడు.
అయితే వాళ్లు అంతలా ఎలా సంపాదించారు అనే క్లారిటీ లేదు.
అంత టైట్ సెక్యూరిటీ మధ్య కమల్ హాసన్ ఎలా వెళ్లి.. చాలా ఈజీగా ఎలా చంపారు అనేది కూడా క్లారిటీ ఉండదు. ఇంకా చెప్పాలంటే… చాలా లాజిక్ కు అందని సీన్స్ సినిమాలో ఉంటాయి. అలాగే వాళ్లను చంపే సీన్స్ కూడా సాగదీసి పెట్టినట్టు ఉంటుంది.

కాస్త ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ తర్వాత.. సెకండాఫ్ అయినా సెట్ అవుతుందేమో అనుకుంటే… అక్కడా కూడా అదే తీరు. ఏదో జరగబోతుంది వెయిట్ చేద్ధాం.. అని ఓపికతో చూస్తూ కూర్చోవాలే తప్పా… ఏం జరగదు. కానీ, పార్ట్ 3 కి కనెక్ట్ చేసి, భారతీయుడు 3 పైన ఇంట్రెస్ట్ అయతే క్రియేట్ చేయగలిగారు.

సెకండాఫ్‌లో ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది కాస్త ఒకే అని చెప్పొచ్చు. అయితే అక్కడా ఇంకా ఎమోషన్ ని పండించే ఛాన్స్ ఉంది. కానీ, డైరెక్టర్ పూర్తిగా వాడుకోలేదు.

ఇక కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే.. వన్ మెన్ షో. సినిమాకు కావాల్సినంత చేశాడు. ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి చేశాడు. సిద్ధార్థ్ ఫర్మామెన్స్ కూడా బాగానే ఉంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఉందో అర్థం కాదు. పార్ట్ 3లో అయినా, ఆమెకు ఇంపార్టెన్స్ ఉంటుందో చూడాలి. బాబీ సింహా ఆకట్టుకున్నాడు. ఈయనకు పార్ట్ 3లో మంచి పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఎస్ జే సూర్య మెయిన్ విలన్ అని అర్థమవుతుంది. భారతీయుడు 3లో కమల్ హాసన్ – ఎస్ జే సూర్య మధ్యే ఫైట్ ఉండబోతుంది. సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. కొన్ని చోట్ల చేతులెత్తేసింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ మరింత జరగాల్సింది.

ప్లాస్ పాయింట్స్ :

కమల్ హసన్
సిద్ధార్థ్
పార్ట్ 3 కనెక్ట్ చేయడం
కొన్ని ఫైట్స్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

చాలా ఎక్కువ సాగదీత సీన్స్
ఫాస్టాఫ్
సెకండాఫ్‌లో కొంత వరకు
మ్యూజిక్
అనవసరమైన కొన్ని సాంగ్స్

మొత్తంగా… ఈ ఇండియన్ ఈ టైంలో అనవసరంగా వచ్చాడేమో….

Rating – 2.25

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు