Maharaja Twitter Review: మహారాజా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?

Maharaja Twitter Review: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా.. తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా మంచి పేరు దక్కించుకున్న.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా. తన కెరియర్ లోనే 50వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి నితిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. ముందుగా ఓవర్సీస్ లో సినిమా చూసిన నెటిజన్. లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మరి ట్విట్టర్ వేదికగా మహారాజా సినిమాకు రివ్యూ ఇస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ..? మక్కల్ సెల్వన్ తన నటనతో మరోసారి నిరూపించారా..? అనే విషయం ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఈ సినిమా పాజిటివ్, నెగిటివ్ అంశాల విషయానికి వస్తే..

ప్రేక్షకులను మెప్పించిన సన్నివేశాలు..

Maharaja Twitter Review: Did the Maharaja Twitter Review please the audience?
Maharaja Twitter Review: Did the Maharaja Twitter Review please the audience?

•కథ చాలా భిన్నంగా అనిపించింది.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రెండూ కూడా సినిమాకు ప్లస్ కానున్నాయి

•ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన మరింత ఆకట్టుకుందని చెప్పాలి .. ఇప్పటివరకు కనివిని ఎరుగని రేంజిలో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి… మరొకసారి మక్కల్ సెల్వన్ అని నిరూపించుకున్నారు

- Advertisement -

•ఇక బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇక ట్విట్టర్ ద్వారా ప్రతి ఒక్కరు ఈయన పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటున్నారు.

•ఇంటర్వెల్ సన్నివేశాలతో పాటు సినిమాకి బిజిఎం కూడా అదిరిపోయింది..

•ముఖ్యంగా సినిమాటోగ్రఫీతో పాటు ఎమోషన్స్ కూడా మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కంటతడి తెప్పిస్తాయి. ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ కామెడీ తో, సస్పెన్స్ తో నిండిపోయింది.

•ఇక ఇందులో ఉండే ట్విస్టులు, తీసుకునే మలుపులు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా అనిపిస్తాయి.

* క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. మొత్తానికి అయితే డైరెక్టర్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రేక్షకులకు బోర్ కొట్టే సన్నివేశాలు..

సినిమా కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.. మొదట్లో కొంత భాగం బోర్ అనిపించినా.. తర్వాత కథ చెప్పే విధానం.. నిదానంగా ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళ్లిన తీరులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి..

విశ్లేషణ:

తప్పకుండా చూడాల్సిన సినిమా అని అయితే కచ్చితంగా చెప్పవచ్చు..

నెటిజన్స్ అభిప్రాయాలు..

ఇక ట్విట్టర్ రివ్యూ ద్వారా ఎవరెవరు తమ అభిప్రాయాలను ఎలా పంచుకున్నారు అనే విషయానికి వస్తే.. ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా మహారాజా సినిమా చాలా బాగుంది.. కుటుంబంతో తప్పకుండా కలిసి చూడాల్సిన సినిమా.. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే నే అత్యంత బలం.. స్టోరీ చెప్పిన విధానం ఫస్ట్ ఆఫ్ కి బలం.. సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఎమోషన్స్ ని దట్టించి అదరగొట్టేశాడు.. ముఖ్యంగా అనురాగ కశ్యప్ పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ , నితిలాన్ దర్శకత్వం, విజయ్ సేతుపతి యాక్టింగ్ అన్ని అంశాలు కూడా సూపర్ గా ఉన్నాయి అంటూ కామెంట్ చేశాడు.

ఇంకొక నెటిజన్ విషయానికి వస్తే.. మహారాజా సినిమా మూవీ లక్ష్మీ ఎవరు అనే పాయింట్ తో మొదలవుతుంది.. ఫస్ట్ ఆఫ్ లో కామెడీ కాస్త సస్పెన్స్ లాంటివి పాజిటివ్ అంశాలుగా నిలిచాయి.. ఇక విజయ్ సేతుపతికి కచ్చితంగా కం బ్యాక్ మూవీ.. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ చూస్తే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు.. ఈ సినిమాలో నటించిన వారందరూ కూడా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు అంటూ తెలిపారు..

 

ఇక మహారాజా మూవీ ఫస్ట్ అఫ్ చాలా బాగుంది
..విజయ్ సేతుపతికి పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇది.. ఇంటర్వెల్ లో థ్రిల్లింగ్ సీన్స్ , యాక్షన్ సూపర్.. మహారాజా గా విజయసేతుపతి క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుంది.. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ కామెడీతో ప్యాక్ అయిపోయింది అంటూ కామెంట్లు చేశారు.

మరొకరు విజయసేతుపతికు 50వ చిత్రం బెస్ట్ సినిమా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సినిమాలలో ఇది కూడా ఒకటి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు