Music Shop Murthy Movie Review : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ రివ్యూ

Music Shop Murthy Movie Review : అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతుంది ఆంటే అందరిలోనూ రకరకాల డౌట్స్ ఏర్పడతాయి. ఎందుకంటే ఈరోజుల్లో కొంత ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు చూడటానికే జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాంటప్పుడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ అయినటువంటి అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర చేసిన సినిమా ఎందుకు చూస్తారు అని..! పైగా ఈ మధ్య చాలా సినిమాల్లో అజయ్ ఘోష్ కనిపిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మేకర్స్ ఈ ప్రయత్నం చేశారు ఆంటే.. ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది అనే డౌట్ అందరికీ వచ్చింది. టీజర్, ట్రైలర్స్ చూశాక.. అది నిజమేనేమో అనే అభిప్రాయం కూడా అందరిలో ఏర్పడింది. మరి నిజంగా సినిమా ఆ స్థాయిలో ఉందా? తెలుసుకుందాం పదండి :

కథ :

మ్యూజిక్ పై అమితమైన భక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి మూర్తి అలియాస్ మ్యూజిక్ షాప్ మూర్తి(అజయ్ ఘోష్). ఇంటర్నెట్ రోజులు రానంత వరకు ఇతని షాప్ బాగా నడిచేది. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి వచ్చాక.. ఇతని షాప్ వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడరు. దీంతో మూర్తి భార్య జయ(ఆమని) ఆ మ్యూజిక్ షాప్ తీసేసి.. సెల్ ఫోన్ షాప్ పెట్టుకోమని గొడవ పెడుతూ ఉంటుంది. అయినా మూర్తి మ్యూజిక్ షాప్ పై ఉన్న ప్రేమను చంపుకోలేక.. డబ్బులు రాకపోయినా నడుపుతూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ఫీజ్ కోసమని ఓ మ్యూజిక్ షో చేస్తాడు మూర్తి. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది అయితే మీరు డీజే నేర్చుకోండి అని సూచిస్తారు. అదే టైంకి ఇతని షాప్ కి అంజనా(చాందినీ చౌదరి) తన డీజే కన్సోల్ రిపేర్ చేయించుకునేందుకు వస్తుంది. అంజు డీజే కన్సోల్ రిపేర్ చేసిన తర్వాత మూర్తి.. దాని డబ్బులకి బదులు డీజే నేర్పమని కోరతాడు. అలా ఆమె వద్ద డీజే నేర్చుకుంటాడు మూర్తి. అయితే ఒక రోజు ఆమె ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీంతో ఆమె తండ్రి(భానుచందర్) మూర్తి పై కేసు పెడతాడు? అసలు అంజు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ కేసు నుండి మూర్తి ఎలా బయటపడ్డాడు? ఆ తర్వాత అతని షాప్, కుటుంబం ఏమైంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు శివ పాలడుగుని అన్ని రకాలుగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే హీరోలతో కాకుండా అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటుడితో తన మొదటి సినిమా చేయాలి అని డిసైడ్ అవ్వడంలోనే అతని గట్స్ తెలుస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి కథని రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులతో కూడా చేసే ఛాన్స్ ఉంది. కానీ అజయ్ ఘోష్ కి ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే దర్శకుడు ఇతనికి స్టిక్ అయ్యి ఈ సినిమా తీసుండొచ్చు. ఏదైతేనేం అతను సరైన నిర్ణయమే తీసుకున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ రెగ్యులర్ గా అనిపించినా.. ఎక్కడా బోర్ కొట్టలేదు. క్లైమాక్స్ అయితే అందరితో కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది. అలా అని ట్రాజెడీ ఎక్కువ పెట్టేశారు అని కాదు. అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుంది. టెక్నికల్ టీం అంతా బాగానే పనిచేశారు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. అజయ్ ఘోష్ ఫుల్ మర్క్స్ కొట్టేస్తాడు. డౌట్ లేదు. తర్వాత ఆమని జీవించేసింది అని చెప్పాలి. చాందినీ చౌదరి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కానీ సెకండ్ హాఫ్ లో ఈమె పాత్ర ఎక్కువ కనిపించదు. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చి చేరుతుంది. మిగిలిన నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

అజయ్ ఘోష్

ఫస్ట్ హాఫ్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఆకట్టుకునే పాటలు ఉంటే ఇంకా బాగుండేది

మొత్తంగా ఈ మధ్య కాలంలో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ వంటి మంచి సినిమా రాలేదు. బ్యూటిఫుల్ ఎమోషన్స్, డైలాగ్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే..కలగలిపి ఈ సినిమాని మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.75/5

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు