Ninda Movie Review : నింద మూవీ రివ్యూ

Ninda Movie Review : వరుణ్ సందేశ్ ఒకప్పుడు ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారు లోకం’ వంటి హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత అతను ఒకే రకమైన లవ్ స్టోరీస్ తీయడంతో ప్రేక్షకులు అతన్ని పక్కన పెట్టారు. దీంతో అతను సినిమాలకి కూడా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి ‘బిగ్ బాస్ 3 ‘ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రియాలిటీ షో వల్ల ఇతనికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. దీంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూశాడతను. కానీ అది ఫలించడం లేదు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఇది హైలెట్ అయ్యింది. మరి ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుందా? లేక నిరాశపరిచిందా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం పదండి :

కథ :

వివేక్(వరుణ్ సందేశ్) నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) అధికారిగా పనిచేస్తుంటాడు. అతని తండ్రి సత్యానందం (తనికెళ్ల భరణి) రిటైర్ అయిన ఓ జడ్జ్. అయితే అతనికి తెలీకుండా.. చివరి కేసులో తప్పుడు తీర్పు ఇస్తాడు. దాని వల్ల బాలరాజు(ఛత్రపతి శేఖర్) కి ఉరిశిక్ష పడుతుంది. దీంతో సత్యానందం మానసికంగా కృంగిపోయి ఆరోగ్యం పాడుచేసుకుని చనిపోతాడు. దీంతో వివేక్.. తన తండ్రి తప్పుని సరిదిద్దాలని భావించి బాలరాజుని ఇరికించిన కేసుని దర్యాప్తు చేపడతాడు. అయినా అతనికి అసలు నిజం తెలీదు. దీంతో ఆ ఊరికి చెందిన.. ముఖ్యంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన జనాలను వివేక్ ఏం చేశాడు. వారితో అసలు నిజం ఎలా చెప్పించాడు. అసలు బాలరాజుపై ఏ కేసులో నింద మోపారు. చివరికి అతన్ని వివేక్ కాపాడగలిగాడా? లేక అతని తండ్రి సత్యానందంలా అయిపోయాడా? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ ‘నింద’ సినిమా.

విశ్లేషణ :

ఒక అమాయకుడిని అన్యాయంగా ఓ మర్డర్ కేసులో ఇరికించడం. అతన్ని రక్షించడం కోసం హీరో పోరాడటం. ఇది కొత్త లైన్ కాదు. అప్పుడెప్పుడో ‘రౌడీ అల్లుడు’ సినిమా నుండి చూస్తున్నదే. ఈ మధ్యనే ‘నాంది’ సినిమా వచ్చింది. అది కూడా సేమ్ లైన్. అయినప్పటికీ నూతన దర్శకుడు రాజేష్ జగన్నాథం… దీనిని కొత్తగా చెప్పాలని ట్రై చేశాడు. కాబట్టి స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోవాలి. అక్కడే ఇతను ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ కి పావుగంట ముందు హీరో ఫేస్ రివీల్ చేస్తాడు. అది ఎందుకు అనేది? ఎంత జుట్టు పీక్కున్నా అర్ధం కాదు. ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా ప్రేక్షకులు నిట్టూర్పు విడుస్తారు. అది కూడా నీరసంగానే పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందా? ట్విస్టులు ఉంటాయా? అనే ఆలోచన కూడా రాకుండా.. సెకండ్ మొదటి 5 నిమిషాల్లోనే విసిగించడం మొదలుపెడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో బాలరాజు తానే ఈ మర్డర్ చేసానని చెప్పడంతో ఆ నీరసం ఇంకా ఎక్కువవుతుంది. అతను ఎందుకు అలా చెబుతున్నాడు అనేది అప్పటికే జనాలకి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందుగానే గెస్ చేసేలా ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే ఎంత వీకో అర్ధం చేసుకోవచ్చు. క్లైమాక్స్ కూడా అంతే నీరసంగా సాగుతుంది. అయితే ఫైనల్ గా ఇచ్చిన కన్క్లూజన్ బాగానే ఉంది. టెక్నికల్ టీం బాగానే పనిచేసింది. కానీ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపించినప్పుడు అన్నీ వీక్ గానే అనిపిస్తాయి.

- Advertisement -

వరుణ్ సందేశ్ పేరుకే ఇందులో హీరో. అతను మార్క్ ఎనర్జీ లెవెల్స్ అస్సలు కనిపించవు. ఈ మాత్రం పాత్రకి ఎవరున్నా ఎక్కువే అనే ఫీలింగ్ కలుగకమానదు. తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్ ల పాత్రలే సినిమాకి కీలకం. కానీ వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేదు. మిగిలిన నటీనటుల పాత్రలు అస్సలు గుర్తుండవు.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం 2 గంటలే ఉండటం

కన్క్లూజన్

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా.. ఓపిక ఉంటే ఈ ‘నింద’ ని భరించడం కష్టం. ఓటీటీలో కూడా ఇలాంటి సినిమా ఇరిటేషనే తెప్పిస్తుంది.

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు