Paruvu web Series Review : పరువు వెబ్ సిరీస్ రివ్యూ

Paruvu web Series Review : మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన వెబ్ సిరీస్ పరువు. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 లో ప్రసారమవుతుంది. నివేదా పెతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రను పోషించిన ఈ సిరీస్ కు రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు. మరి నివేదా పెతురాజ్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఓటిటీ మూవీ లవర్స్ ని మెప్పించిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే..

పల్లవి, సుధీర్ ను ప్రేమ వివాహం చేసుకుంటుంది. అయితే కులం తక్కువ వాడు కావడంతో అతనితో పెళ్లిని పల్లవి తల్లిదండ్రులు ఒప్పుకోరు. దీంతో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో, పల్లవిని ఆమె కుటుంబ సభ్యులు దూరం పెట్టేస్తారు. అయితే ఆ తర్వాత తన పెదనాన్న చనిపోయాడని తెలిసి కడసారి చూపుకు భర్తతో కలిసి సొంత ఊరికి వెళ్తుంది పల్లవి. ఈ క్రమంలో పల్లవి బావ చందు వీళ్ళిద్దరికీ కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఇష్టం లేకపోయినా బంధువులు అనే ఆలోచనతో వాళ్లకి లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత చులకనగా మాట్లాడుతాడు. ఈ వ్యవహారంలో పల్లవికి చందుకి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి చందు గన్ కొనడంతో తమను చంపడానికే అని భయపడుతుంది పల్లవి. ఈ విషయాన్ని సుధీర్ కి చెప్పగా, అతను ఆవేశంలో చందుని చంపేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి శవాన్ని మాయం చేయాలని చూస్తారు. మరోవైపు చందు కోసం వెతికే ఆయన ప్రియురాలు స్వాతి లోకల్ ఎమ్మెల్యే రామయ్య కిడ్నాప్ చేశాడేమోనని అనుమానిస్తుంది. మరి చందు డెడ్ బాడీని సుధీర్, పల్లవి ఏం చేశారు ? స్వాతికి అసలు విషయం తెలిసిందా ? ఇందులో ఎమ్మెల్యే రామయ్య ఎలా ఇరుక్కున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

Paruvu Web Series: ‘పరువు’ హత్యల నేపథ్యంలో నివేదా తెలుగు వెబ్ సిరీస్ .. ఓటీటీలో...

- Advertisement -

ఎలా ఉందంటే…

మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా, మొదటి నుంచి చివరి వరకు సిరీస్ ను ఇంటెన్స్ గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకద్వయం సిద్ధార్థ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు సొసైటీలో ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి అనే అంశాలను అర్థమయ్యేలా చెప్పడంలో, సస్పెన్స్ ని కంటిన్యూ చేయడంలో డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. చివరకు సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూసేలా చేశారు. నటీనటులు, టెక్నికల్ టీం తమ పరిధి మేరకు బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్ ఏమిటంటే కాన్సెప్ట్ కొత్తదైనప్పటికీ ఈ పాయింట్ మాత్రం చాలా పాతది. ముఖ్యంగా చందు డెడ్ బాడీని మాయం చేయడానికి వేసే ప్లాన్స్ అన్ని అసహనాన్ని పెంచేస్తాయి. అలాగే ఫ్యామిలీ సీన్స్ లో ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వవు. కొన్ని ట్విస్ట్ లు, డైలాగ్స్ ఆకట్టుకున్నప్పటికీ కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం లవర్స్ ను నిరాశ పరుస్తుంది.

చివరగా…

కొన్ని ట్విస్ట్ లు, డైలాగ్స్ ఆకట్టుకున్నప్పటికీ కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం లవర్స్ ను నిరాశ పరుస్తుంది. కానీ ఒకసారి అయితే ఈ సిరీస్ ను చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు