Saripodhaa Sanivaaram Twitter review : సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. అంతా బాగుంది కానీ..

Saripodhaa Sanivaaram Twitter review : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా కాసేపటికిందే థియేటర్లలో రిలీజ్ అయింది. వివేక్ ఆత్రేయ – నాని కాంబోలో ‘అంటే సుందరానికి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అప్పుడు క్లాస్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన వీళ్ళు, ఇప్పుడు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులపై భారీగా అంచనాలను పెంచేయగా, దానికి తగ్గట్టుగానే ఆన్లైన్ బుకింగ్స్ లో జోరు చూపించింది ఈ సినిమా. ఇక ఫైనల్ గా సరిపోదా శనివారం సినిమా వరల్డ్ వైడ్ గా నేడు రిలీజ్ కావడం జరిగింది. ఇక ఉదయం నాలుగు గంటల నుండే ప్రీమియర్స్ పడిపోగా, తాజాగా సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ (Saripodhaa Sanivaaram Twitter review) వచ్చేసింది.

Saripodhaa Sanivaaram Movie Twitter review

కమర్షియల్ వే లో కొత్తగా…

ఇక సరిపోదా శనివారం సినిమా టాక్ విషయానికి వస్తే.. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంటుంది. సినిమా కథ నేపథ్యం సింపుల్ గా ఇంతకు ముందు చూసిన సినిమాల మాదిరే ఉంటుందని చెప్పాలి. సోకుల పాలెం అనే ఊరులో ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఒక నార్మల్ మనిషిగా ఉండే సూర్య శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదరించే వ్యక్తిగా నాని ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇక ఫైనల్ గా ఆ పోలీస్ ఆఫీసర్ ని అడ్డుకోవడంతో సూర్య (Nani) (నాని) కెరీర్ మరో మలుపు తిరుగుతుంది. ఫైనల్ గా సూర్య ఏం చేసాడు. అతనికి చారులత (ప్రియాంక అరుళ్ మోహన్) (Priyanka arul mohan) ఎలా సాయపడింది అనేది థియేటర్లలో చూడాలి.

- Advertisement -

అంతా బాగుంది కానీ..

అయితే సినిమా పూర్తయ్యాక మొత్తం మీద దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కథని బాగా రాసుకున్నాడని చెప్పాలి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడ్డాడని టాక్. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నా, సెకండాఫ్ విషయంలో కొద్దిగా తడబడ్డాడని తెలుస్తుంది. సెకండాఫ్ లో హై ఇచ్చే సీన్లు బాగానే ఉన్నా, ఏం జరుగుతుందో జనాలకు ముందే తెలిసిపోతుంది. ముఖ్యంగా సినిమా లెంగ్త్ మూడు గంటలకు దగ్గరగా ఉండడం మైనస్ అవుతుంది. అయితే ఈ సినిమాలో నాని – ఎస్.జె.సూర్య (S.j.surya) పోటాపోటీగా అద్భుతంగా నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ తన పాత్రకు తగ్గట్టుగా డీసెంట్ గా ఆకట్టుకుంది. జేక్స్ బీజోయ్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా బీజీఎమ్ నిలుస్తుంది. మరి ఫైనల్ గా ప్రేక్షకులని సరిపోదా శనివారం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు