Manamey Movie Review : మనమే మూవీ రివ్యూ

Manamey Movie Review : శర్వానంద్ దాదాపు రెండేళ్ల తర్వాత చేస్తున్న సినిమా మనమే. పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో శర్వా థియేటర్ లోకి వచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ, దాని ముందు ఈవెంట్స్‌లో గానీ ఈ మనమే మూవీ శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. సినిమా సక్సస్ అవుతుందని, సక్సెస్ పార్టీ పిఠాపురంలో చేస్తామని కూడా అనౌన్స్ చేశాడు. అంటే ఈ మూవీని శర్వా అంతలా నమ్మాడు. అలాగే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా… శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ అంటే ఓ వర్గం ఆడియన్స్‌లో ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన మనమే మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజు థియేటర్ లోకి వచ్చిన ఈ మనమే మూవీ ఆడియన్స్ మెప్పించిందా..? అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్ధాం…

స్టోరీ :

లండన్ వీధుల్లో గాలికి తిరుగుతూ.. అమ్మాయిలతో ఫ్లట్టింగ్ చేస్తూ తిరిగే కుర్రాడు విక్రమ్ (శర్వానంద్). ఓ జాబ్ చేస్తూ, మాటకు విలువ ఇస్తూ, కార్తిక్ అనే అబ్బాయితో ఎంగేజ్‌మెంట్ చేసకుని ఫర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయి సుభద్ర (కృతి శెట్టి). వీరి ఇద్దరి ఫ్రెండ్స్ అనురాగ్ – శాంతి ఓ ప్రమాదంలో మరణిస్తారు. ఈ అనురాగ్ – శాంతి కి ఖుషి అనే 2 ఏళ్ల బాబు ఉంటారు. ఖుషి కోసం విక్రమ్ – సుభద్ర 6 నెలలు కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వీరి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లింది? కార్తికతో సుభద్రకు జరిగిన ఎంగేజ్‌మెంట్ ఏం అయింది? ఖుషి భాద్యత ఎవరు తీసుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ :

కొంత మంది హీరోలు ఉంటారు. ఆ హీరో నుంచి సినిమా వచ్చిందంటే.. చాలు ఓ వర్గం ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి హీరోనే శర్వానంద్. ఢిపరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుని ఆడియన్స్‌తో చప్పట్లు కొట్టించుకుంటాడు. ఇప్పుడు మనమే సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్ ఢిపరెంట్ అని చెప్పలేం. కానీ, ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఫ్రెండ్ ఫ్యామిలీ ప్రమాదంలో చనిపోతే, వాళ్ల వారసుడుని హీరో, హీరోయిన్ కలిసి చూసుకోవడం, ఈ క్రమంలో లవ్‌లో పడటం, ఈ లవ్ దక్కించుకోవడానికి హీరో కష్టపడటం… ఇదే సినిమా. స్టోరీ సింపుల్‌గా ఉన్నా… చూసినంత సేపు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే, విజువల్స్ అని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్లు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా, సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. అందువల్లే ఆడియన్స్ చివరి వరకు థియేటర్స్ లో కూర్చున్నారు.

అయితే దీన్ని డైరెక్టర్ పూర్తిగా యూజ్ చేసుకోలేడు. చాలా ఎమోషనల్ పాయింట్స్ ఉన్న సినిమా స్క్రిన్ పై కదులుతూ పోతుందే కానీ ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్ అయ్యేలా ఉండదు. సినిమాలో పాత్రలు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. కానీ, దీన్ని చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం అలాంటి ఫీల్ కలగించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అలాగే పాత్రల మధ్య బాండింగ్ డైలాగ్స్‌లోనే చూపించాడు కానీ, ఎక్కడా కూడా స్క్రీన్‌పై కనిపించదు. అనురాగ్ – విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా గొప్పగా చెప్పాడు. కానీ, అది రిఫ్లేక్ట్ అయ్యేలా ఎక్కడా చూపించలేదు. అమ్మ – కొడుకు మధ్య ప్రేమను చూపించేలా కొన్ని సీన్స్ పెట్టాల్సింది.

అలాగే సినిమాలో విలన్‌గా రాహుల్ రవీంద్రన్ చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఈ సినిమాలో విలన్ ఏంటి అని డైరెక్టర్ మొహమాటు పడినట్టు పెద్దగా చూపించలేదు. ఓ సీన్‌లో అనురాగ్ – శాంతి లను బిజినెస్ కోసం రాహుల్ రవీంద్రన్ చంపినట్టు అనే మీనింగ్ వచ్చేలా చూపించారు. అలాగే ఖుషిని కూడా చంపబోతున్నట్టు చూపించారు. కానీ, దాన్ని మధ్యలోనే వదిలేసి, హీరో – హీరోయిన్ మధ్య గొడవ/లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ మధ్య ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో అసంపూర్తి అన్న ఫీల్ వస్తుంది.

అలాగే సినిమాలో సాంగ్స్ కొంత వరకు మైనస్‌లా అనిపిస్తాయి. మూవీలో 16 పాటలు ఉన్నాయి. ఇన్ని సాంగ్స్ విన్నట్టు కూడా అనిపించదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నట్టు ఉంటాయి. మధ్యలో కొన్ని సార్లు… ఇది ఎక్కడో విన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక హీరో శర్వానంద్… ది బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. కృతి శెట్టి మార్క్ అయితే కనిపించలేదు. ఖుషి పాత్రలో చేసిన బాబు మెచ్చుకోవాల్సిందే. రాహుల్ రవింద్రను మరింత వాడుకునే స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ వాడుకోలేదు. ఇక మిగతా పాత్రలు అన్ని కూడా జస్ట్ ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే. ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా చోట్ల కత్తరకి పని చెప్పాల్సింది.

ప్లాస్ పాయింట్స్ :

శర్వానంద్ యాక్టింగ్
విజువల్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌లో ఉన్న ల్యాగ్
విలన్‌ను మరింత యూజ్ కోవాల్సింది
కొన్ని చోట్ల మ్యూజిక్
అంచనా వేసే క్లైమాక్స్

మొత్తంగా… కొంత ల్యాగ్ ఉన్నా… ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్ : 2.25

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు