Thangalaan Movie Review : ‘తంగలాన్’ మూవీ రివ్యూ

Thangalaan Movie Review : ‘తంగలాన్’ టీజర్ తో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అయితే రిలీజ్ ఆలస్యం అవ్వడం వల్ల.. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని మర్చిపోయారు. అయితే ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి మంచి హైప్ ఉన్న తెలుగు సినిమాలతో పోటీగా వదలడం వల్ల.. మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ సినిమా. మరి వాటి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలబడే స్థాయి ‘తంగలాన్’ కి ఉందా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం పదండి :

కథ :

తంగలాన్ (విక్రమ్), గంగమ్మ (పార్వతి తిరువొతు) దంపతులు తమకు కలిగి ఉన్న కొద్దిపాటి భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరి పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఓసారి పంట చేతికి వచ్చే టైంకి అది తగలబడిపోతుంది. మరోపక్క సిస్తు కట్టలేదని అక్కడి జమీందారు తంగలాన్ కి చెందిన పొలాన్ని స్వాధీనపరుచుకుని.. అతని కుటుంబంతో చాకిరీ చేయించుకుంటూ ఉంటాడు.అదే టైం క్లెమెంట్ దొర బంగారు గనులు తవ్వడానికి వారి ప్రదేశానికి వస్తాడు. అయితే అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. తనకి సాయంగా వచ్చి ఆ గనులు తవ్వడంలో సాయపడితే ఎక్కువ డబ్బు ఇస్తానని తంగలాన్ కి అతని అనుచరులకు చెబుతాడు. ఆ తర్వాత ఏమైంది? ‘తంగలాన్’ కలలో కనిపించే ఆరతి (మాళవికా మోహనన్) ఎవరు? మరోపక్క అరణ్య (విక్రమ్) ఎవరు? తంగలాన్ చివరికి బంగారం గనిని తవ్వి.. వచ్చిన డబ్బుతో తన భూమిని దక్కించుకున్నాడా? లేక క్లెమెంట్ కుట్ర పన్నాడా? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

పా రంజిత్ సినిమాల్లో దళితుల గురించి, వారిని అణగదొక్కిన పరిస్థితుల గురించి ఎక్కువగా వర్ణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే అతనిపై ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. ‘తంగలాన్’ ట్రైలర్ చూశాక.. అది పీరియాడికల్ నేపథ్యంలో చెప్పబోతున్నారేమో అనే అభిప్రాయం కూడా కలిగింది. ట్రైలర్లోని విజువల్స్ కచ్చితంగా ఈ సినిమా చూడాలనే ఆసక్తిని రేకెత్తించాయి. కానీ సినిమా విడుదల లేట్ అవ్వడం వల్ల ఆసక్తి సన్నగిల్లింది. ఏదేమైనా తంగలాన్ విషయంలో పెద్ద మైనస్ అయిన అంశం దాని టైటిల్. పాన్ ఇండియా సినిమా తీస్తున్నప్పుడు మన తెలుగు ఫిలిం మేకర్స్ అన్ని భాషల్లోనూ దాని అర్ధం ధ్వనించేలా టైటిల్ పెడుతుంటారు. కానీ తమిళ ఫిలిం మేకర్స్ మరీ ఘోరంగా తయారయ్యారు. వలీమై, జిగర్తాండ డబుల్ ఎక్స్.. ఇలా వారి ప్రేక్షకులకి అర్ధమయ్యే టైటిల్స్ తోనే తెలుగు ప్రేక్షకుల పై కూడా వదిలేస్తున్నారు. ‘తంగలాన్’ అంటే వ్యక్తి పేరు కాబట్టి.. పర్వాలేదు. కానీ వేరే టైటిల్ అయితే చాలా బాగుండేది.

- Advertisement -

ఇక సినిమా ఆరంభం అయితే బాగుంది. ఓ తెగకి చెందిన వారిగా తంగలాన్ గూడెం ప్రజలు కనిపిస్తారు. ఆడవాళ్ళకి రవికలు ఉండవు. పురుషులు అందరూ అంగోస్త్రం మాత్రమే ధరించి కనిపించడం.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. బంగారు కొండ సీన్ వచ్చినప్పుడు.. అందరిలో ఉత్కంఠత నెలకొంటుంది. ఆ సన్నివేశాలు విజువల్ గా కూడా బాగా అనిపిస్తాయి. ముఖ్యంగా సర్పాలు ఒకేసారి జనాలపై పడటం వంటి సన్నివేశాలు థియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా వెంటాడతాయి. ఫస్ట్ హాఫ్ రేసీగా అనిపిస్తుంది.సెకండాఫ్ పై కూడా ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్ విషయంలో దర్శకుడు బ్యాలన్స్ తప్పాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సన్నివేశాలే.. సెకండాఫ్ లో కూడా వస్తుండటం.. ప్రేక్షకులు నిట్టూర్పులు వదలడానికి కారణమయ్యాయి. అంతేకాదు ఈ గోల్డ్ మైనింగ్ యాక్షన్ అడ్వెంచర్ కి మరో మైనస్ అంటే నిడివి కూడా అని చెప్పాలి. అయితే క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. దర్శకుడు పా రంజిత్ మాత్రమే కాదు జివి ప్రకాష్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. అన్ని క్రాఫ్ట్..లు మనసు పెట్టి పనిచేసారు. టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ‘తంగలాన్’. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే..

విక్రమ్ 3 రకాల పాత్రల్లో అద్భుతమైన నటన కనపరిచాడు. ఈ పాత్రలో అతన్ని తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టం. అంతేకాదు అతను లేకుండా ‘తంగలాన్’ కూడా ఉండేది కాదేమో అనేంత ఇంపాక్ట్ చూపించాడు. మాళవిక, పార్వతిల.. నటన కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. పశుపతి కూడా తన మార్క్ నటనతో మెప్పించారు. మిగిలిన వారి పాత్రలు ఎక్కువగా గుర్తుండవు. ఎందుకంటే చాలా వరకు అందరి వేషధారణ ఒకేలా ఉండటం వల్ల.

ప్లస్ పాయింట్స్ :

విక్రమ్ నటన

ఫస్ట్ హాఫ్

విజువల్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్

నేటివిటీకి దూరంగా ఉండే కొన్ని సన్నివేశాలు

మొత్తంగా.. ‘తంగలాన్’ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సెకండాఫ్ లో కొంచెం గ్రిప్పింగ్ నెరేషన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటే.. ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేది.

రేటింగ్ : 2.25/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు