The GOAT Movie Twitter Review: విజయ్ గోట్ ట్విట్టర్ రివ్యూ.. బెస్ట్ అనిపించాడా..?

The GOAT Movie Twitter Review.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu) డైరెక్షన్ లో విజయ్ దళపతి (Vijay dalapati) హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్ (The Goat). సెప్టెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో విడుదల అవ్వగా అభిమానులు, నెటిజన్స్ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ మీద విమర్శలు వినిపించాయి. విజయ్ ని చూపించిన తీరుకు అందరూ పెదవి విరిచారు కూడా.. సాంగ్స్ మీద వచ్చిన ట్రోలింగ్ తో సినిమాలో లుక్స్ బెటర్ చేద్దామని డైరెక్టర్ వెంకట్ ప్రభు చెబుతూనే వస్తున్నాడు. మరి ఈ సినిమా టాక్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. మరి ఈ సినిమాతో విజయ్ విజయం అందుకున్నాడా అనే విషయం ఇప్పుడు చూద్దాం.

The GOAT Movie Twitter Review: Vijay's Goat Twitter Review.. Did you think it was the best..?
The GOAT Movie Twitter Review: Vijay’s Goat Twitter Review.. Did you think it was the best..?

ది గోట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. సినిమా ఎర్లీ విషయాలతో అభిమానుల సందడి పీక్స్ కి వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ సినిమా చూస్తూ సంబరపడిపోతున్నారు. టైటిల్ కార్డు అదిరిపోయిందని, విజయ్ కాంత్ ఎంట్రీ సూపర్ అని, దళపతి ఎంట్రీ ఇంకో లెవెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి భాగం అద్భుతం అని, అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని కామెంట్ చేస్తున్నారు.

ఆ పది నిమిషాలు మిస్ కాకండి..

విజయ్ దళపతి, ఇళయ దళపతి ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ 10 నిమిషాలు ఎవరు మిస్ అవ్వకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా చాలా అద్భుతం అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్ ఎంట్రీ కి అరుపులతో థియేటర్లు బద్దలు అవుతున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది.

- Advertisement -

లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్.. వెయిటింగ్

ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ అదిరిపోయింది.. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్.. వెయిటింగ్ అనే సన్నివేశాలు అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి. మొత్తానికి గోట్ సినిమా మాత్రం విజయ్ ఫ్యాన్స్ కి ఒక పండగలా ఉంది అంటూ కామెంట్ చేశారు. ఇప్పటివరకు ట్విట్టర్లో విజయ్ ఫ్యాన్స్ వరుస ట్వీట్ల తో సందడి చేస్తున్నారు.

పెద్ద మిస్టేక్ అదే..

రజినీకాంత్ ను తండ్రిగా , ధనుష్ ను కొడుకుగా తీసుకోవాలని అనుకున్నారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. కానీ డి ఏజింగ్ యాప్ ఉపయోగించి ఒకే హీరోతో తండ్రి కొడుకుల వేషం వేయించవచ్చు అని ఆలోచించిన ఆయన విజయ్ ను రంగంలోకి దించారు. అయితే ఈ సినిమా కథపరంగా బాగానే ఉంది. కానీ విజయ్ డి ఏజింగ్ లుక్స్ మాత్రం సినిమాకి నెగటివ్ అయ్యేలా కనిపిస్తున్నాయి..ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని ఎలా స్వీకరిస్తారో చూడాలి.అయితే ఇందులో హీరోయిన్ గురించి ఎవరూ కూడా పెద్దగా ట్వీట్ చేయలేదు.

ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే ..విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, విజయ్ యాక్షన్, యువన్ సంగీతం సినిమాకు ప్లస్ కానున్నాయని సమాచారం. హీరో ఎలివేషన్స్ అదిరిపోయాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది సినిమా బోరింగ్ గా ఉందని, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునే అంతగా ఏమీ లేదు అని చెబుతున్నారు, మరి ఈ సినిమా పూర్తి రివ్యూ పొందాలి అంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు