Uruku Patela Review : ‘ఉరుకు పటేలా’ రివ్యూ

Uruku Patela Review : ‘హుషారు’, ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ వంటి సినిమాలతో నటుడిగా ప్రేక్షకులకి నోటెడ్ అయ్యాడు తేజస్ కంచర్ల. పాయల్ తో చేసిన ‘ఆర్.డి.ఎక్స్. లవ్’ తర్వాత ఎందుకో ఇతని కెరీర్లో గ్యాప్ వచ్చింది. 5 ఏళ్ళ తర్వాత ఈరోజున( సెప్టెంబర్ 7న) ‘ఉరుకు పటేలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అతను ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

పటేల(తేజస్ కంచర్ల)… ఊరి సర్పంచ్ రామరాజు (గోపరాజు రమణ) కొడుకు.చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకోవడంతో తండ్రి చాటు బిడ్డలా పెరుగుతాడు. కొడుకు ఏం చేసినా వెనకేసుకొచ్చే తత్వం రామరాజు..ది..! అందుకో ఏదో తరగతికి పటేలా చదువు మానేసినా.. రామరాజు అతన్ని ఏమీ అనడు. అయితే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది పటేలా కోరిక. అయితే ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలు కానీ.. చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కానీ పటేలాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. కానీ స్నేహితుని పెళ్ళిలో అనూహ్యంగా డాక్టర్ అక్షర (ఖుష్బూ చౌదరి) పటేలాకి పరిచయమవుతుంది. ఇద్దరూ తెలీకుండానే ప్రేమలో పడతారు. అయితే ఊహించని విధంగా అక్షరని రక్షించబోయి.. పటేలా యాక్సిడెంట్ పాలవుతాడు. ఈ క్రమంలో అతనికి ఓ కాలు బాగానే ఉన్నా.. ఇంకో కాలు చచ్చుబడిపోతుంది. దీంతో ఎలాగైనా సరే అతన్నే పెళ్లి చేసుకోవాలని అక్షర డిసైడ్ అవుతుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరిస్తారు. తర్వాత ఆమె పుట్టినరోజు నాడు.. తమ కొత్త హాస్పిటల్ కి రమ్మని అక్షర అండ్ ఫ్యామిలీ పటేలా..ని ఇన్వైట్ చేస్తారు. అక్కడికి వెళ్లిన పటేలాని హత్య చేయాలని డిసైడ్ అవుతారు అక్షర అండ్ ఫ్యామిలీ. అది ఎందుకు? పటేలాకి అక్షర ఫ్యామిలీతో ఉన్న శత్రుత్వం ఏంటి? ఫైనల్ గా అతను ప్రాణాలతో బయటపడ్డాడా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

ఈ మధ్య కొన్ని చిన్న సినిమాల టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి కానీ.. తీరా ఆ సినిమాలు చూస్తే నిరాశపరుస్తున్నాయి. సందేహమే లేకుండా ఈ ‘ఉరుకు పటేలా’ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే.. కచ్చితంగా ఇది ప్రామిసింగ్ మూవీ అనిపిస్తుంది. కానీ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ అభిప్రాయం మారిపోవడానికి ఎంతో టైం పట్టదు. మొదటి 15 నిమిషాలకే ఇది రొటీన్ రొట్ట సినిమా అనే ఓ ఐడియా వచ్చేస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులతో కూడుకున్న కామెడీ.. ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. అది ఫోర్స్డ్ గా అనిపిస్తుంది.అయితే ఇంటర్వెల్ కి వచ్చేసరికి.. మిగతా భాగం ఆసక్తిగా ఉంటుందేమో అనే హాప్ క్రియేట్ అవుతుంది. సో అలా ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత టైం పాస్ చేయొచ్చు. కానీ సెకండాఫ్ లో ఎటువంటి ఆసక్తికర అంశాలు లేవు. అవే సీన్లు రిపీట్ అవుతున్నట్టు,కథ కూడా అక్కడే తిరుగుతున్నట్టు.. పరమ ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో తన తండ్రి కాలర్ పట్టుకుని రౌడీలను చితక్కొట్టిన హీరో, సెకండాఫ్ లో తన ప్రాణాలు కాపాడుకోవడానికి అంతలా ఎందుకు కష్టపడుతున్నాడా? అతనిలో అంత పిరికితనం ఎందుకు వచ్చిందా? అనే డౌట్లు రాకుండా పోవు. అన్నట్టు క్లైమాక్స్ లో గ్యాప్ లేకుండా కొన్ని ట్విస్ట్..లు ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక్ రెడ్డి. కానీ అవి ఏమాత్రం థ్రిల్ చేయలేదు. చాలా వరకు సీన్లన్నీ ముందే తెలిసిపోతుంటాయి. సో డౌట్ లేకుండా స్క్రీన్ ప్లేనే మేజర్ మైనస్. నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ రేంజ్లో ఏమీ లేవు, మ్యూజిక్ పర్వాలేదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సోగానే ఉంది.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

తేజస్ కంచర్ల (Tejas Kancharla) బాగానే పెర్ఫార్మ్ చేశాడు కానీ.. ఎక్కువగా ‘డీజే టిల్లు’ లో సిద్ధు జొన్నలగడ్డని, ‘జాతి రత్నాలు’ లో నవీన్ పోలిశెట్టిని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అతని లుక్ కూడా అలానే ఉంటుంది. హీరోయిన్ ఖుష్బూ చౌదరి (Khushboo Chaudhary) గ్లామర్ తో కానీ, నటనతో కానీ ఎంత మాత్రం మెప్పించింది లేదు. ఈమెకు నటించే స్కోప్ కూడా దర్శకుడు ఇవ్వలేదు. సుదర్శన్, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లు ఉన్నప్పటికీ కామెడీ పండలేదు. గోపరాజు రమణ తనకి అలవాటైపోయిన తండ్రి పాత్రలో కనిపించి బోర్ కొట్టించాడు.

ప్లస్ పాయింట్స్ :

ఇంటర్వెల్

స్టోరీ లైన్

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా ఈ ‘ఉరుకు పటేలా’ టైటిల్ కి తగ్గట్టే ప్రేక్షకులను థియేటర్ల నుండి బయటకి ఉరికించేలానే ఉంది.

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు