Maharaja Movie Telugu Review : మహారాజా మూవీ రివ్యూ

Maharaja Movie Telugu Review : ఇండియన్ సినిమాలో కలర్ ఉన్నవాడే కాదు… కష్టపడ్డవాడే హీరో అని నిరూపించింది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈయన నుంచి సినిమా వస్తుంది అంటే, రెండో ఆలోచన లేకుండా థియేటర్‌కి వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువే అంటే, అర్థం చేసుకోవాలి… విజయ్ సేతుపతి ఎంచుకునే స్టోరీలు ఎలా ఉంటాయో. ఇప్పుడు మహారాజా మూవీ కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిందే. తమిళల్లోనే కాదు, తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్న మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మహారాజా.. విజయ్ సేతుపతి పేరును నిలబెట్టిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్ధాం…

స్టోరీ :

మహారాజా (విజయ్ సేతుపతి) నెమ్మది స్వభావంతో ఉండే ఓ బార్బర్. ఓ ప్రమాదంలో భార్య కోల్పోవడంతో, ఊరికి దూరంగా ఓ ఇంట్లో కూతురితో ఉంటాడు. ఉదయం బార్బర్ షాప్ కి వెళ్లి రాత్రి 10 గంటల వరకు ఇంటికి రావడం. ఇదే రెగ్యులర్ దినచర్య. తన కూతురు స్పోర్ట్స్ కోసం వేరే విలేజ్ కి వెళ్లిన సమయంలో మహారాజా ఇంట్లో దొంగలు పడి.. అతన్ని బాగా కొట్టి, ఇంట్లో ఉన్న లక్ష్మీ (చెత్త బుట్ట)ను ఎత్తుకెళ్తారు. దీంతో ఆ చెత్తబుట్టను వెతికి పెట్టాలని పోలీసులకు కంప్లైట్ చేస్తాడు..? అందు కోసం పోలీసులకు లక్షల్లో డబ్బులు కూడా ఇస్తాడు..? చెత్త బుట్ట కోసం మహారాజా ఎందుకు అంత ఖర్చు చేశాడు..? అసలు ఇంట్లో దొంగలు ఎందుకు పడ్డారు..? ఆ చెత్త బుట్టనే ఎందుకు ఎత్తుకెళ్లారు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే…? మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా అంటే, ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు… మూడు రొమాన్స్ సీన్స్… ఓ ఐటెం సాంగ్.. అంటూ మూస పద్దతిలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఓ కంటెంట్ బెస్డ్ సినిమా వస్తే కాస్త ఉపశమనం వస్తుంది. అలాంటి ఉపశమనం ఇచ్చే మూవీనే ఈ మహారాజా.

- Advertisement -

సినిమాలో పాటలు ఉండవు… రొమాన్స్ సీన్స్ ఉండవు.. కానీ, కాస్త వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ, కావాల్సినన్ని ట్విస్ట్ లు ఉంటాయి. సినిమా పూర్తి అయ్యే వరకు మీ చూపును పక్కకు మళ్లించనివ్వడు డైరెక్టర్. సినిమా సాగుతుంది.. అంటే సాగుతుంది. కాకపోతే థియేటర్‌లో పడే ఫస్ట్ బొమ్మ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా కూడా బోరు ఫీల్ రాదు. కథ స్టార్ట్ అవుతుంది… సాఫీగా సాగుతుంది. ఎక్కడ ఏ క్యారెక్టర్ రివీల్ అవ్వాలో అక్కడ ఆ క్యారెక్టర్ వస్తుంది.. తన పని చేసుకుని వెళ్లిపోతుంది. రావాల్సిన టైంలో ట్విస్ట్ వచ్చి.. అప్పటికే ఇంట్రెస్ట్‌తో ఉన్న ఆడియన్‌ను మరింత అటెన్షన్ చేసి సినిమాతో ప్రయాణించేలా చేస్తుంది. ఇదింతా జరిగింది అంటే, డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అని చెప్పుకొవచ్చు. కొన్ని సార్లు… ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లేనే అని కూడా అనొచ్చు అంటే అర్థం చేసుకోవాలి.. డైరెక్టర్ కథనాన్ని ఎంత పకడ్బందీగా రాసుకున్నాడో.

ఫస్టాఫ్… కొన్ని పాత్రలు పరిచయం అవ్వడం… ఆ వెంటనే సమయం వెస్ట్ చేయకుండా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిపోవడం… మధ్యలో కొన్ని డీసెంట్ కామెడీ సీన్స్.. ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్. ఇంతే.. దీనికంటే ఎక్కవ చెప్పలేం. ఇక సెకండాఫ్‌లో మొత్తం సీరియస్‌నెస్.. థ్రిల్లింగ్ అంశాలు.. నెక్ట్స్ ఏం జరుగుతుంది అని ఆడియన్స్‌లో ఆసక్తి కనిపిస్తుంది. అలా ఎవరూ అంచనా వేయలేని క్లైమాక్స్. ఆ సమయంలో హీరో కూతురు చెప్పే ఓ డైలాగ్. ఆ.. డైలాగ్ చిన్నదైనా.. టచ్ అయ్యేలా ఉంటుంది. ఇక ఆడియన్స్‌ నుంచి చప్పట్లు రావడం అంతే జరుగుతుంది.

ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విజయ్ సేతుపతి వల్లే సినిమా నడిచింది అని చెప్పొచ్చు. ఎక్కడ ఎలాంటి ఫర్మామెన్స్ కావాలో అంతే ఇచ్చాడు. సాధారణ సమయాల్లో ఎలాంటి వాటికి రెస్పాండ్ కాలేని పాత్ర… కొన్ని సందర్భంలో క్రూయల్‌గా రియక్ట్ అయ్యే పాత్ర ఎక్కడా కూడా తగ్గకుండా నటించాడు. ఇక విలన్ పాత్ర చేసిన అనురాగ్ కశ్యప్‌ను కూడా మెచ్చుకోవాల్సిందే. కూతురిపై ప్రేమ ఉండే అత్యంత క్రూరమైన తండ్రి పాత్ర చేశాడు. పాత్ర ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమ… విలనిజం చూపించాల్సిన సమయంంలో విలనిజాన్ని బాగా చూపించాడు. మిగితా అన్ని పాత్రలను డైరెక్టర్ సరిగ్గా వాడుకున్నాడు. ఇక అజనీష్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ సరిగ్గా సెట్ అయింది.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్
స్టోరీ, స్క్రీన్ ప్లే
ఇంటర్వేల్
డిఫరెంట్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్

మొత్తంగా… మహా “రాజా” లాంటి సినిమా.

రేటింగ్ : 3/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు