The Greatest of All Time Movie Telugu Review : ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రివ్యూ

The Greatest of All Time Movie Telugu Review :విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. కొన్నాళ్లుగా అతని సినిమాలు కూడా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాయి. అయితే ఈ సారి అంటే ఈరోజు.. ఎటువంటి అంచనాలు లేకుండా ‘ది గోట్’ ( The Greatest of All Time ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అది ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పందండి…

కథ :

యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ లో కీలక వ్యక్తిగా పనిచేస్తుంటాడు గాంధీ (విజయ్). అయితే అది సీక్రెట్ మిషన్ కాబట్టి తన భార్య అనుకి (స్నేహా).. తన ఉద్యోగం గురించి చెప్పడు. ఈ క్రమంలో భార్య పిల్లలతో థాయ్ లాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు గాంధీ. అక్కడికి అతను ఓ మిషన్లో భాగంగా వెళ్తాడు. కొడుకుని పోగొట్టుకున్న బాధలో ఎమోషనల్ అయ్యి స్క్వాడ్ నుండి అంటే ఆ మిషన్ ను వదిలి గాంధీ బయటకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఊహించని విధంగా మాస్కోలో ఉన్న గాంధీకి.. అతని కొడుకు జీవన్ కనిపిస్తాడు. కొడుకు బ్రతికే ఉన్నాడని సంతోషించిన గాంధీ అతన్ని వెంటబెట్టుకుని ఇండియాకు తిరిగొస్తాడు. అయితే తర్వాత ఊహకందని విధంగా అతని బాస్ నజీర్ (జయరామ్)ని అలాగే గాంధీ సన్నిహితుల్ని ఎవరో చంపేస్తారు?ఆ హత్యల వెనకున్నది ఎవరు? తల్లిదండ్రులకి దూరమైన తర్వాత జీవన్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

దర్శకుడు వెంకట్ ప్రభు ‘మానాడు’ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ విజయ్ పిలిచి మరీ ఈ సినిమా చేసుకునే ఛాన్స్ కల్పించాడు. సినిమాకి కాంబినేషనల్ క్రేజ్ అయితే లేదు. కానీ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న క్రమంలో.. తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానంతో ‘ది గోట్’ ని లేపారు తమిళ తంబీలు. తెలుగులో అయితే ఈ సినిమా పై మినిమమ్ బజ్ కూడా లేదు. విజయ్ లుక్స్ పై జరిగిన ట్రోలింగ్ వల్ల సినిమా వార్తల్లో నిలిచింది. ప్రచార చిత్రాలు ఏమీ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది గోట్’ ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాలా అనిపిస్తుంది.

- Advertisement -

దర్శకుడు ఏదైతే థ్రిల్, ట్విస్ట్ అని ఫీలయ్యాడో అది ప్రేక్షకులకి రుచించదు.పైగా వాటిని ముందుగానే వాళ్ళు అంచనా వేసే విధంగా ఉన్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. అందులో మెట్రో ఫైట్ సీక్వెన్స్ ఒకటి. సెకండాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బెటర్. అలా అని భీభత్సం కాదు. వెంకట్ ప్రభు మ్యాజికల్ స్క్రీన్ ప్లే పూర్తిగా మిస్ అయినా సినిమాగా ‘ది గోట్’ ని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఏదీ కూడా పండలేదు. రైటింగ్ చాలా పూర్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే యూట్యూబ్లో రీల్స్ ని తలపిస్తాయి.

టెక్నికల్ గా కూడా ‘ది గోట్’ పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. ఇప్పటివరకు విజయ్ సినిమాలకి హైప్ తెచ్చింది అనిరుధ్ మ్యూజిక్. కానీ ఈసారి అతను లేకపోవడం వల్ల విజయ్ సినిమాకి పెద్ద బలం పోయిన ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది. యువన్ కొన్ని సీన్స్ కి బాగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా.. సీన్ పండకపోవడం వల్ల అతని పనితనం కూడా కనిపించలేదు.

నటీనటుల విషయానికి వస్తే.. విజయ్ గాంధీ పాత్రలో బాగా నటించాడు. కానీ జీవన్ పాత్ర ముందు నుండి ఊహించినట్టుగానే సినిమాకి మైనస్ అయ్యింది. లుక్స్ కూడా ఇంకో రెండేళ్లకు సరిపడా ట్రోల్ స్టఫ్ అనుకోవాలి. టెక్నాలజీని వాడి కెప్టెన్ విజయ్ కాంత్ ను చూపించిన తీరు బాగుంది. కానీ ‘కల్కి’ లో అమితాబ్ రేంజ్ యంగ్ గెటప్ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం పాత్రలు సో సో గానే ఉన్నాయి. స్నేహ,లైలా..ల పాత్రలు కూడా అంతే..! హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర కూడా కిక్ ఇవ్వదు. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

ప్లస్ పాయింట్స్ :

విజయ్(గాంధీ పాత్ర)
సెకండాఫ్( కొంత వరకు)

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
మ్యూజిక్
ఫస్ట్ హాఫ్

మొత్తంగా.. ఈ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ విజయ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించడం కష్టమే. మిగిలిన వాళ్ళు కూడా ‘భరించడం కష్టమే’

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు