Yevam Movie Review : ‘యేవమ్’ మూవీ రివ్యూ

Yevam Movie Review : విచిత్రంగా ఈ వారం అంతే జూన్ 14 న హీరోయిన్ చాందినీ చౌదరి నుండి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఒకటి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కాగా రెండోది ఈ ‘యేవమ్’. చాందినీ ఎక్కువగా ఈ సినిమాకే ఆంటే ‘యేవమ్’ కే ప్రమోషన్స్ చేసింది. దీంతో అందరూ ‘ఈ సినిమానే బాగుంటుందేమో’ అని అనుకున్నారు. మరి అది నిజమో..?కాదో..? ఈ రివ్యూలో తెలుసుకుందాం పదండి :

కథ :

కట్టుకున్న భార్య హారిక(ఆషురెడ్డి) మరో మగాడితో బెడ్ పై కులుకుతూ ఉంటే.. చూసి తట్టుకోలేక ఆమెను, అలాగే ఆమెతో బెడ్ షేర్ చేసుకున్న వ్యక్తిని కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాడు యుగంధర్ (వశిష్ఠ సింహా). అయితే తన భార్య హారికకి సినిమా రంగానికి చెందిన వాడంటే ఇష్టం. అందుకే వెబ్ సిరీస్ లో నటించేవాడితో ఆమె అఫైర్ పెట్టుకుంటుంది. అందుకే యుగంధర్.. సిటీలో ఉన్న అమ్మాయిల్లో ఎవరైతే సినిమా వాళ్ల పై వ్యామోహం పెంచుకుంటారో.. వాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి.. ఓ అమ్మాయిని ట్రాప్ చేసి ఓ చోటుకి రప్పిస్తాడు. అక్కడ ఆమె తిరగబడితే.. తప్పక ఆమెను చంపేస్తాడు. ఈ కేసుల్ని సాల్వ్ చేయడానికి అభిరామ్ (జై భరత్ రాజ్) సౌమ్య(చాందినీ చౌదరి) రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో సౌమ్య.. అభిరామ్ కి దగ్గరవుతుంది. కానీ అతను మాత్రం తనకి పెళ్లైంది అని చెప్పి.. ఆమెను ఇగ్నోర్ చేస్తుంటాడు? అసలు అభిరామ్ గతమేంటి? ఆమె భార్య ఎవరు? యుగంధర్ కి అభిరామ్ కి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి.. ఏదో కొత్తగా ట్రై చేశాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది కూడా..! ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఏదో మంచి సస్పెన్స్ ఉంటుంది అనే ఆశలు కలుగుతాయి. కానీ ఆ సస్పెన్స్ దిగిపోవడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. సెకండాఫ్ మొదలైన కాసేపటికే మనకి ‘అపరిచితుడు’ ‘హరే రామ్’ ‘హిడింబ’ వంటి సినిమాలు కళ్ళ ముందు మెదులుతాయి. అంతే ఎంత రొటీన్ గా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. పైగా చాందినీ చౌదరి చీర కట్టుకుని కూడా విలన్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ సీన్ చెప్పే ఈమెతో ఓకే అనిపించి ఉంటాడు దర్శకుడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా గొప్పగా ఏమీ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ పేలవంగా ఉన్నాయి. వెబ్ సిరీస్..లు కూడా ఇంతకంటే క్వాలిటీగా ఉంటున్న ఈ రోజుల్లో ఇలాంటి చీప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో కూడుకున్న సినిమాలు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

యుగంధర్ పాత్ర చేసిన ‘కె.జి.ఎఫ్’ నటుడు వశిష్ఠ సింహా తప్ప మిగిలిన వాళ్లంతా చాలా కృత్రిమంగా పనిచేసినట్టు అనిపిస్తుంది. చాందినీ చౌదరి.. విజయశాంతి రేంజ్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత తుస్సుమనిపిస్తుంది. భరత్ రాజ్.. నిర్మాతలతో ఉన్న రిలేషన్ కారణంగా సినిమాలు చేస్తున్నాడేమో కానీ.. అతని నటనలో సహజత్వం పూర్తిగా కొరవడింది. గోపరాజు రమణ ఈ సినిమాకి ఒకటి, రెండు రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇచ్చినట్టు ఉన్నాడు. అతని పాత్ర షో ఆఫ్ అన్నట్టే ఉంది. ఇక అషురెడ్డి అయితే లంచ్ చేసి షూటింగ్ కి వచ్చి డిన్నర్ టైంకి ఇంటికి వెళ్ళిపోయింది అనుకుంట. అందుకే నటనకి ఆస్కారం లేకుండా యాడ్ షూట్ చేసినట్టు చేసి చెక్కేసినట్టుంది. మిగిలిన నటీనటులు పెద్దగా గుర్తుండరు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా

‘యేవమ్’… భరించడం కష్టం. కాబట్టి.. ఈ వీకెండ్ హ్యాపీగా స్కిప్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు