70th National Film awards: సత్తా చాటిన తెలుగు చిత్రం.. జాతీయ అవార్డులు సొంతం..!

70th National Film awards.. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ చలనచిత్ర అవార్డ్స్ కూడా ఒకటి. ముఖ్యంగా ఈ అవార్డ్స్ రావాలి అంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను విడుదల చేయగా.. బెస్ట్ తెలుగు ఫిలిం క్యాటగిరిలో కార్తికేయ -2 నిలిచింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలవడమే కాదు.. ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి కి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. పైగా ఈ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలకు కూడా నేషనల్ అవార్డు లభించింది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి తెలుగు చిత్రాలైన బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీపడ్డాయి. ఇంత గట్టి పోటీకి ఎదురెళ్లి జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది కార్తికేయ -2.

70th National Film awards: Satta chatina Telugu film.. National awards..!
70th National Film awards: Satta chatina Telugu film.. National awards..!

ఇక ప్రాంతీయ భాషల విషయానికి వస్తే కన్నడ నుంచి కేజిఎఫ్ -2, తమిళ్ నుంచి పొన్నియన్ సెల్వన్ -1 చిత్రాలు ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.

కార్తికేయ -2:

2022లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కార్తికేయ 2.. కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా.. కాలభైరవ సంగీతం అందించారు. ఇక ఇందులో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతూ నటించిన చిత్రం ఇది. శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందులో కీలకపాత్రలు పోషించారు. జూన్ 24 2022న ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ఇక ఆగస్టు 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. దైవత్వం అనే కాన్సెప్ట్ తో దేవుడు మనుషుల రూపంలో కూడా ఉంటాడు అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డును కూడా దక్కించుకోవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు నుండి చాలా సినిమాలు పోటీపడ్డా ఈ సినిమాకు మాత్రమే జాతీయ అవార్డు రావడంతో అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ.. డైరెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నిర్మాతలుగా అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు కూడా నేషనల్ అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ కొన్ని చిత్రాలను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక త్వరలోనే కార్తికేయ -3 కూడా రాబోతోందని, కార్తికేయ -2 ఎండింగ్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కార్తికేయ -3 ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు