Committee Kurrollu : ఇప్పటివరకూ మెగా డాటర్ ని విష్ చేయని బన్నీ.. పేరు చెప్పలేదనేనా?

Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ యదు వంశీ డైరెక్ట్ చేయడం జరిగింది. అంతా కొత్త తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి థియేటర్లలో మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాపై టీజర్, ట్రైలర్ల ద్వారా మంచి అంచనాలు ఏర్పడగా, థియేటర్లలో రిలీజ్ అయ్యాక మంచి మౌత్ టాక్ ని తెచ్చుకుంది. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంటుంది. అయితే తొలి రోజు మహేష్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడినా ఆ తర్వాత మంచి గ్రోత్ చూపించి వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించి, వర్కింగ్ డే లో కూడా స్టడీగా దూసుకుపోతుంది.

Allu Arjun did not wish Niharika Konidela

సెలెబ్రిటీల ప్రశంసలు..

ఇక కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాక, ఈ సినిమాపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ శుభాకంక్షాలు తెలిపారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తూ, నిహారిక కు కూడా శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే నేచురల్ స్టార్ నాని కూడా తన బెస్ట్ విషెస్ ని అందచేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ మారుతీ, క్రిష్ జాగర్లమూడి తమ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి అందరూ నిహారిక సహా, చిత్ర యూనిట్ కి తమ అభినందనలు తెలియచేసారు.

- Advertisement -

మెగా డాటర్ ని పట్టించుకోని బన్నీ..

అయితే మెగా ఫ్యామిలి నుండి నిహారిక కొణిదెల అందరి విషెస్ దక్కాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముందు నుండి తమ సపోర్ట్ నిహారిక కు అందచేయగా, రిలీజ్ తర్వాత కూడా శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ లు కూడా తమ బెస్ట్ విషెస్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండే తెలియచేయగా, లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నిహారికకు అలాగే కమిటీ కుర్రోళ్ళు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ అల్లు అర్జున్ (Allu arjun) మాత్రం ఇప్పటివరకు నిహారికను కానీ, సినిమా యూనిట్ ని కానీ పట్టించుకోలేదు.

మెగా ఫ్యామిలీ లో కొన్నాళ్ల నుండి ఉన్న కలతల కారణంగా అందరూ మాట్లాడుకోలేకయినా, సోషల్ మీడియాలో నిహారికకు విష్ చేస్తారని అనుకున్నా చేయలేదు. దీనికి కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అందరి పేర్లు తలచి బన్నీ పేరు మాత్రం చెప్పలేదు. అందువల్లే అల్లు అర్జున్ కూడా పట్టించుకోవట్లేదని అంటున్నారు నెటిజన్లు. పైగా అల్లు అర్జున్ చిన్న సినిమాగా వచ్చే వారం రిలీజ్ అవుతున్న “ఆయ్” సినిమాకు తన బెస్ట్ విషెస్ ని అందచేశాడు. కానీ నిహారిక సినిమాని పట్టించుకోలేదు. దీన్ని బట్టి మెగా – అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలు ఎంత పీక్స్ లో ఉన్నాయో అర్ధమవుతుంది. మరి దీనిపై నిహారిక ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు