Life style: ఈ దేశంలో ఒక్కరు కూడా కాఫీ తాగరు… ఎందుకో తెలుసా?

Life style

ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, లేదా వర్క్ చేస్తున్నప్పుడు మైండ్ రిఫ్రెష్ కావడానికి వేడివేడి కాఫీని తాగడానికి చాలామంది ఇష్టపడతారు. వాస్తవానికి కాఫీ రుచిని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వాళ్లు కూడా అప్పుడప్పుడు కాఫీని తాగుతూ ఉంటారు. కానీ మొత్తానికే కాఫీని బ్యాన్ చేసిన దేశం ఒకటి ఉందని మీకు తెలుసా? అసలు ఆ దేశంలో ఒక్కరు కూడా కాఫీని చేయరట, తాగరట. మరి వాళ్ళు ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? కాఫీ బదులు వాళ్లు ఏం తాగుతున్నారు? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్తే…

150 ఏళ్ల క్రితం కాఫీ గింజలను పండించే వరల్డ్స్ లార్జెస్ట్ దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కాఫీ ఫామ్ ఉండేదట. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పండించే కాఫీ చాలా ఫేమస్. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ పండించే కాఫీ గింజల ద్వారా తయారైన కాఫీని తాగడానికి బాగా ఇష్టపడేవారట. కానీ ఒకానొక రోజు అనుకోకుండా వచ్చి పడిన విపత్తు కారణంగా కాఫీ ప్లాంట్స్ అన్నీ నాశనం అయ్యాయట. దీనివల్ల కాఫీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్నదట. ఆ తర్వాత శ్రీలంక వాసులు రీసెర్చ్ చేసి కాఫీ ప్లేస్ ను భర్తీ చేసే ఒక కొత్త రకమైన ప్రోడక్ట్ ను కనుగొన్నారట. అది కాఫీ కంటే బెటర్ గా ఉండే హెల్దీ డ్రింక్. అందులో కాఫీతో పోల్చుకుంటే 1/3 కెఫిన్ మాత్రమే ఉంటుంది. పైగా కాఫీ లాగా తలనొప్పినీ కలిగించదు. మామూలుగా అయితే కాఫీ ఎక్కువ ఫ్లేవర్స్ లో దొరకదు, కానీ శ్రీలంకన్స్ కనిపెట్టిన ఈ కొత్త డ్రింక్ మాత్రం చెప్పలేనని వెరైటీ ఫ్లేవర్స్ లో దొరుకుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిస్ ను తగ్గించడంతోపాటు వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తాయి. ఇంతకీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆ డ్రింక్ ఏంటి అంటే… టీ. అవును నిజమే శ్రీలంకతో పాటు ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఈ టీలోనే ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

కాఫీ బదులు టీని తయారు చేయడమే శ్రీలంక చరిత్రలో వాళ్ళు తీసుకున్న బెస్ట్ డెసిషన్. ప్రస్తుతం ప్రపంచంలో టీ పొడిని పండిస్తున్న, తయారు చేస్తున్న లార్జెస్ట్ దేశాల్లో శ్రీలంక 4వ స్థానంలో ఉండడం విశేషం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ఐలాండ్ మొత్తంలో 4% టీ ప్లాంట్స్ ఉన్నాయట. 1 మిలియన్ శ్రీలంకన్స్ టీ ఫామ్స్ లోనే పని చేస్తారు. అలాగే ఇక్కడ జీవించే ప్రతి ఒక్కరూ టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక శ్రీలంకలో ఎక్కడ చూసినా టీని తయారు చేసే ఫ్యాక్టరీలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దొరికే న్యాచురల్ వైట్ టీ పొడి ప్రపంచంలోనే ఎక్స్పెన్సివ్. పదుల సంఖ్యల ఫ్లేవర్లలో దొరికే ఈ టీ పొడిని శ్రీలంక వాసులు సైన్స్ గా భావిస్తారట. జస్ట్ 2.5 గ్రామ్స్ టీ పొడిని కప్పు వేడి నీటిలో కలుపుకుని తాగుతారు. ఇది అక్కడ గత వందేళ్ళ నుంచి కొనసాగుతున్న ట్రెడిషన్. ఇక్కడ దొరికే టీ పొడి ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా కాస్త తియ్యగా ఉంటుందట. అదే దీని ప్రత్యేకత.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు