Athulya Ravi : టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం… ముగ్గురు అరెస్ట్

Athulya Ravi : ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇంట్లో పని చేసే పని మనిషే ఇతరులతో కలిసి ఈ చోరీ చేసినట్టు సమాచారం. తాజాగా పోలీసులు దొంగతనానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు.

హీరోయిన్ ఇంట్లో దొంగతనం

తన అందం, అభినయంతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న అతుల్యకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తున్నారు. తాజాగా ఈ హీరోయిన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం నటి తన పాస్‌పోర్ట్‌తో పాటు రూ.2000 అందుకుంది. కానీ సడన్ గా అవి ఇంట్లో కనిపించకపోవడంతో వెతికి వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు అతుల్య తల్లి. ఈ విషయమై అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ లో ఇంట్లో పని చేసే పని మనిషే చోరీకి పాల్పడినట్లు తెలిసింది.

మరో ఇద్దరితో కలిసి ప్లాన్

తొండముత్తూరు సమీపంలోని కులతుపాలేనికి చెందిన ఓ మహిళ (46) కొన్నేళ్లుగా అతుల్య రవి ఇంట్లో పని చేస్తోంది. ఇంట్లో దొంగతనం జరిగిందని అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించి, పని మనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. మహిళను విచారించగా అసలు విషయం ఏంటో బయటపడింది.

- Advertisement -

THE AESTHETIC OF AUTHENTICITY with Athulya Ravi

పోలీసుల విచారణలో పని మనిషి తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణిలతో కలిసి హీరోయిన్ ఇంట్లో డబ్బు, పాస్‌పోర్టు దొంగిలించినట్టు ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నటి పాస్‌పోర్టును ఎక్కడ దాచారనే దానిపై నిందితులు పెదవి విప్పడం లేదని అంటున్నారు. దీంతో వాళ్ళు అసలు ఈ దొంగతనం చేయడం వెనకున్న కారణం ఏంటి అని తెలుసుకునే పని పడ్డారు పోలీసులు. మరోవైపు పాస్ పోర్ట్ గురించి వాళ్ళు బయట పెట్టకపోవడం ఆసక్తికరంగా మారింది.

హీరోయిన్ కు ఆఫర్లు కరువు

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అతుల్య రవి. ‘మీటర్’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కానీ ఫస్ట్ మూవీనే డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి మరో ఆఫర్ రాలేదు. 2017లో కాదల్ కన్ కటుటే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కావలసినంత అందం, అభినయం ఉన్నప్పటికీ అతుల్యకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అడపా దడపా ఏవైనా చిన్న అవకాశాలు వచ్చినా వాటినే సద్వినియోగం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఆమె ఇంట్లో దొంగతనం జరగడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు