HBD Mahesh Babu: ఆస్తులలో కుబేరుడు.. దానంలో కర్ణుడు..!

HBD Mahesh Babu.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు ఈరోజు 49వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పెద్దఎత్తున అభిమానులు పుట్టినరోజు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు థియేటర్ల వద్ద మహేష్ బాబు కటౌట్ లకే పాలాభిషేకం కూడా చేస్తున్నారు. పైగా ఈరోజు మహేష్ బాబు సినీ కెరియర్లో కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచిపోయిన మురారీ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూ ఉండడంతో కొత్తగా విడుదలయ్యే సినిమాలకు దెబ్బ పడింది అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

BD Mahesh Babu: Kubera in assets.. Karna in donations..!
BD Mahesh Babu: Kubera in assets.. Karna in donations..!

సినిమాలే కాదు బిజినెస్ లో కూడా దూకుడు..

ఇదిలా ఉండగా మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే , మరొకవైపు సహాయం సహకారాలు అందిస్తూ ఎంతో మందిని ఆదుకుంటున్నారు. ఇకపోతే పలు సినిమాలు, యాడ్స్, బిజినెస్ ద్వారా వేలకోట్ల రూపాయలను సంపాదించిన ఈయన ఆ డబ్బును ఇతరులకు, ముఖ్యంగా శరణార్థం వచ్చినవారికి అందించడంలో కూడా ముందుంటారు. అందుకే మహేష్ బాబుని ఎప్పుడు “ఆస్తులలో కుబేరుడు.. దానంలో కర్ణుడు” అని చెబుతూ ఉంటారు. ఇకపోతే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తులు ఎంత వున్నాయి..?ఆయన సహాయ సహకారాలు ఎట్టిది.? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు నికర ఆదాయం..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, నిర్మాతగా, బిజినెస్ మాన్ గా ఫుల్ గా సంపాదిస్తున్నారు. ఇప్పటివరకు 50 యాడ్ లలో నటించారు మహేష్ బాబు. అంతేకాదు ఒక్కో యాడ్ కి సుమారుగా రూ .10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు, ఫుడ్ రంగంలో కూడా ఈయన అడుగులు వేశారు, అంతేకాదు రెయిన్బో హాస్పిటల్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక్కో చిత్రానికి రూ.70 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. పద్మాలయ స్టూడియో తో పాటు తండ్రి వారసత్వంగా కృష్ణ కి సంబంధించిన భూములు, ఖరీదైన బంగ్లాలతో పాటు కార్లు వంటివి మొత్తం కలిపి వేలకోట్లు ఈయన సొంతం. అంతేకాదు ఈయన భార్య నమ్రత కూడా సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలను కట్నంగా తీసుకొచ్చిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మహేష్ బాబు ఆస్తి విలువ సుమారుగా రూ.10వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం . దీన్ని బట్టి చూస్తే ఈయన సంపాదనలో కుబేరుడు అని చెప్పవచ్చు.

- Advertisement -

చిన్నారుల పాలిట దేవుడు..

ఇక ఈయన దానం విషయానికి వస్తే, సుదీర్ఘమైన కెరియర్లో ఈయన చేసిన మంచి పనులు ఎన్నో.. ఇచ్చిన విరాళాలు మరెన్నో.. వీటికి మించి మహేష్ బాబు ఫర్ సేవింగ్ హార్ట్స్ పేరిట చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా చిన్నారులను కాపాడారు మహేష్ బాబు. అంతేకాదు హార్ట్ సర్జరీలు చేయించి వాళ్ళ చిరునవ్వుకు ప్రతిరూపమైన ఏకైక హీరోగా కూడా రికార్డు సృష్టించారు. ఇక దీన్ని బట్టి చూస్తే దానంలో కర్ణుడు అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు