Bharateeyudu2 Twitter Review : వింటేజ్ కమల్ విశ్వరూపం… కానీ ఏదో మిస్సయింది?

Bharateeyudu2 Twitter Review : ఎప్పుడెప్పుడా అంటూ నాలుగేళ్లుగా ఎదురుచూసిన కమల్ హాసన్ అభిమానుల ఎదురుచూపులు ఈరోజు తెరపడింది. ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు2 సినిమా వరల్డ్ వైడ్ గా నేడు (జులై12) విడుదలైంది. ఎన్నో ప్రధాన నగరాల్లో ఆల్రెడీ ప్రీమియర్స్ కూడా ఉదయం 4 గంటలకే పడిపోయాయి. థియేటర్ల వద్ద కమల్ హాసన్ అభిమానులు తెల్లవారుజామునుండే బారులు తీరారు. ఇక శంకర్ షణ్ముగం కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉండగా, 1996 లో తెరకెక్కిన భారతీయుడు (ఇండియన్) చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతో తెలిసిందే. దాదాపు 28ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కగా, నేడు ఫైనల్ గా థియేటర్లలో విడుదల కావడం జరిగింది. ఇక కాసేపటికిందే ప్రీమియర్స్ షో కాగా ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకుల నుండి ఫిల్మిఫై ట్విట్టర్ రివ్యూ అలా ఉంది.

Bharateeyudu2 Movie Twitter Review

వింటేజ్ కమల్ హాసన్ విశ్వరూపం…

భారతీయుడు2 సినిమా మొదలుకావడమే మొదటి పార్ట్ గురించి కొన్ని సన్నివేశాలు చూపిస్తూ మొదలుపెట్టగా, కొన్ని మంచి ఎమోష‌న‌ల్ సీన్స్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుందట. ఈ జెనరేషన్ లో సొసైటీ లో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాల‌ను, అక్రమాలను అరికట్టడానికి ఇండియన్ ని తిరిగి రప్పించడమే సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అని సమాచారం. ఇక సినిమా మొదటి నుండి ఇండియాలో ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే ప్రతి బిజినెస్ కార్యక్రమాల్లో, ఎక్కడ చూసిన జరిగే అవినీతిని శంకర్ తన స్టయిల్లో చూపిస్తాడు. వాటన్నిటిని ముందుగా సిద్ధార్థ్ ఆపాలని ట్రై చేసినా ఎదుర్కోలేకపోతాడు. ఈ క్రమంలో సేనాపతి ఎంట్రీ ఉంటుందట. సేనాపతి ఎంట్రీ కాస్త లేట్ అయినా అక్కడి నుండి వేరే విధంగా అవుతుందట. ఇక సేనాప‌తిగా క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం త‌న నటనతో మరోసారి అదరగొట్టేశారని ప్రేక్షకులు అంటున్నారు. క‌మ‌ల్‌ వింటేజ్ భారతీయుడు లుక్స్, మ్యాన‌రిజ‌మ్స్‌ తో ఆకట్టుకోగా, ఆయన చెప్పే డైలాగులు కూడా మంచి గూస్బంప్స్ తెలిస్తాయట. ఓవరాల్ గా ఆమ్ల హాసన్ మరోసారి తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు.

- Advertisement -

అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే?

అయితే ఈ సినిమాకి సంబంధించి ఓవరాల్ గా కంటెంట్ పరంగా రెస్పాన్స్ ఊహించని విధంగా ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందట. ఈ సినిమాలో కమల్ హాసన్ తక్కువ సేపే ఉంటారని, కమల్ కంటే సిద్ధార్థ్ ఎక్కువగా ఉంటాడని అంటున్నారు. అయితే సినిమాకి మెయిన్ మైనస్ స్క్రీన్ ప్లే నే అని సమాచారం. సేనాప‌తి ఎంట్రీ త‌ర్వాత వేగం కథలో వేగం పెరగకుండా తగ్గుతుందట. చాలా బోరింగ్, అండ్ అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో శంకర్ నిరాశపరిచాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో రాసుకున్న కొన్ని సీన్స్ దానికి తగ్గట్టు డైలాగులు బాగున్నా, అవి నేచురల్ గా కాకుండా ఆర్టీఫిషియల్ గా ఉండడం వల్ల ఎమోషన్స్ పండడం లేదని తెలుస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం భారతీయుడు3 పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుందట. ఈ ట్విస్ట్ ని మాత్రం శంకర్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడని సమాచారం. ఇక భారతీయుడు2 విజువల్ గా శంకర్ స్టయిల్లో బాగానే ఉన్నా, అనిరుధ్ మ్యూజిక్ పెద్ద మైన‌స్‌ గా మారిందని టాక్. సినిమాలో బీజీఎమ్ చాలా వరెస్ట్ గా ఉందని సమాచారం. ఇన్ని విభాగాల్లో భారతీయుడు2 కి మైనస్ పాయింట్స్ ఉండగా, శంకర్ మార్క్ అయితే ఓవరాల్ గా మిస్ అయిందని చెప్పొచ్చు. మరి థియేటర్లలో ఫైనల్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు