Bigg Boss 7 : విన్నర్ నుంచి రన్నర్ దాకా సీన్ టు సీన్ లీక్… ఏం ఉల్టా పల్టా అయ్యిందంటే?

బుల్లితెరపై “బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు” గ్రాండ్ ఫినాలే ఫెస్టివల్ మొదలైపోయింది. గత వంద రోజుల నుంచి ఈ సీజన్ విన్నర్ ఎవరెవరు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఎదురు చూపులకు నేటితో తెరపడనుంది. ఫైనల్ ఎపిసోడ్ ను ఈరోజు అత్యంత గ్రాండ్ గా నిర్వహించగా, పలువురు సెలబ్రిటీల నడుమ “బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు” విన్నర్ ఎవరు అనే విషయం స్పష్టం కానుంది. అయితే ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన వివరాలు ముందుగానే లీక్ అయ్యి బిగ్ బాస్ నిర్వహణకు షాక్ ఇచ్చాయి. మరి విన్నర్ నుంచి రన్నర్ దాకా
సీన్ టు సీన్ జరిగిన ఆ లీక్స్ ఏంటి? ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఏం ఉల్టా పల్టా అయ్యింది అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్, ప్రశాంత్ ఉన్నారు. అయితే ఈరోజు జరగబోతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హీరో కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, యాంకర్ సుమ వాళ్ళ అబ్బాయి తో కలిసి బిగ్ బాస్ వేదికపై మెరిశారు. మరి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఎలా ఎలిమినేట్ అయ్యారు? ఇంతకీ ఫైనల్ విన్నర్ ఎవరు అనే విషయానికి వస్తే…

టాప్ 6 కంటెస్టెంట్ – అర్జున్

- Advertisement -

ఈ సీజన్లో టాప్ 6 కంటెస్టెంట్ గా అర్జున్ ఉన్నాడు. అయితే యాంకర్ సుమ హౌస్ లోకి వెళ్లి, తనదైన శైలిలో సందడి చేసి అర్జున్ ని బయటకు తీసుకొచ్చేసింది. దీంతో హౌస్ లో ఇంకా ఐదు మంది కంటెస్టెంట్స్ మిగులుతారు.

టాప్ 5 కంటెస్టెంట్ – ప్రియాంక

ఈ సీజన్లో ఈ కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే టాప్ 5లో స్థానం దక్కించుకుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ప్రియాంక. అందరూ అనుకున్నట్టుగానే ఈ అమ్మడు టాప్ ఫైవ్ దాకా నెట్టుకు రావడం ఆమె అభిమానులను ఆనందపరిచింది. అయితే టాప్ 5లో స్థానం దక్కించుకున్నప్పటికీ ప్రియాంక విన్నర్ కాలేకపోవడం బాధాకరం. ఈమె ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరిలో వైట్ పేపర్ మీద సాండ్ తో ఎవరి ఫోటో వస్తే వాళ్ళు ఎలిమినేట్ అన్నమాట. అలా ప్రియాంక ఫోటో రావడంతో మాస్ మహారాజా రవితేజ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, ఈ బ్యూటీని బయటకు తీసుకొచ్చేసాడు.

టాప్ 4 కంటెస్టెంట్ – యావర్

ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో తనకంటూ స్థానాన్ని క్రియేట్ చేసుకున్న యావర్ ఫైనలిస్ట్ గా నిలవలేకపోయాడు. ఇతను మిగతా ఇద్దరికీ పోటీ ఇవ్వడం కన్నా డబ్బు తీసుకుని బయటకు రావడానికి ఆసక్తిని చూపించాడు. యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ 15 లక్షల సూట్ కేస్ తో యావర్ ని టెంప్ట్ చేసేసారు. దీంతో ఆయన ఆ పదిహేను లక్షలు అందుకుని బయటకు రాక తప్పలేదు.

టాప్ 3 కంటెస్టెంట్ – శివాజీ

ఒకానొక సమయంలో శివాజీ ఈ సీజన్ విన్నర్ అవుతాడని చాలామంది భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన కనీసం రన్నర్ స్థానంలో కూడా నిలవకుండా, టాప్ 3 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఈయన ఎలిమినేషన్ విషయానికి వస్తే… హౌస్ లో ఉన్న ముగ్గురు ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో ఉండే లయన్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ముగ్గురిలో ఎవరికి రెడ్ లైట్ వస్తే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు. అలా శివాజీకి రెడ్ లైట్ రావడంతో ఆయనంతట ఆయనే డైరెక్ట్ గా బయటకు వచ్చేసాడు.

రన్నర్ అండ్ విన్నర్

టాప్ 2 లో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ మిగిలారు. అయితే బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్, బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని ప్రకటించారు. ఇది నిజంగా ఈ రైతుబిడ్డ అభిమానులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలా ఈ సీజన్లో శివాజీ, పల్లవి ప్రశాంత్ విషయంలో ఉల్టా పంట జరిగింది అన్నమాట. అందరూ విన్నర్ అవుతాడని భావించిన శివాజీని బయటకు పంపించేసి, పల్లవి ప్రశాంత్ ని విజేతగా ప్రకటించారు బిగ్ బాస్.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు