Bigg boss season7 leaks : షకీలాకు దెయ్యం పట్టిందా ? బిగ్ బాస్ హౌస్ లో నిన్న రాత్రి ఏం జరిగింది ?

Bigg boss season7 leaks

బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన నాలుగు ఎపిసోడ్స్ లో ఎటువంటి కాంట్రావర్సీ లకు తావు లేకుండా, సరదా టాస్క్ లతో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగుతోంది షో.

ఇప్పుడిప్పుడే జనాలు కూడా బిగ్ బాస్ షో పై ఉన్న నెగిటీవీని కొద్దీ కొద్దిగా మర్చిపోతూ షో కు అలవాటు పడిపోతున్నారు. ఇక అంత సరిగా సాగుతుందనుకునే సమయంలో నిన్న రాత్రి సడన్ గా ఒక విషయం ప్రస్తుతం చర్చనీయా అంశం అయింది.

అదేంటంటే ఉన్నట్టుండి నిన్న రాత్రి షకీలా దెయ్యం పెట్టినట్టుగా బిహేవ్ చేసి హౌస్ లో ఉన్న వాళ్ళను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ హౌస్ మెంట్స్ అంత సరదాగా టాస్క్ లు పర్ఫామ్ చేసి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు. ఇక ఈ టాస్క్ లలో భాగంగానే నిన్న షకీలా కూడా జోకర్ మేకప్ వేసుకొని చక్కగా పాల్గొనింది. బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్ కు పిలిచి.. హౌస్ లో ఉన్న విషయాలపై కాసేపు చర్చించారు. షకీలా కూడా తన అభిప్రాయాలను హౌస్ లో జరుగుతున్న విషయాలను చక్కగా బిగ్ బాస్ కు వివరించింది.

- Advertisement -

ఇక కాఫీ కోసం గొడవ చేసిన శివాజీ విషయంలో కూడా షకీలా స్టాండ్ తీసుకోని కాఫీ పంపాలంటూ శివాజీ కోసం బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసింది. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్న షకీలా ఉన్నట్టుండి నిన్న సాయంత్రం కాస్త అబ్నార్మల్ గా బిహేవ్ చేసింది. దాంతో హౌస్ మేట్స్ భయపడిపోయారు. సింగర్ దామిని అయితే ఏకంగా దేవుడిని తలుచుకోవడం కూడా స్టార్ట్ చేసింది. ఇక కాసేపటికి శివాజీ వచ్చి షకీలను బుజ్జగించి పడుకోబెట్టడంతో ఆమె నిద్ర పోయింది.

అయితే ఈ విధంగా షకీలా చేయడానికి కారణం టాస్క్ లో భాగం అని కొంత మంది అనుకుంటుండగా నిజంగానే షకీలా భయపడిందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మరి షకీలా విషయంలో నిజమెంటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు