Bigg Boss Season 7: అమర్, రతిక మధ్య మాటల యుద్ధం – ఉత్కంఠగా కెప్టెన్సీ టాస్క్..!

బిగ్ బాస్ సీజన్ 7 రోజులు గడుస్తున్న కొద్దీ ఆసక్తిగా సాగుతోంది. ఉల్టా పల్టా అన్న ట్యాగ్ లైన్ తో స్టార్ట్ అయిన ఈ సీజన్లో బిగ్ బాస్ టీమ్ చాలా చేంజెస్ చేసింది. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వటం, 3 వారాల తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వటం వంటి సంఘటనలు సప్రైజింగ్ గా అనిపిస్తున్నాయి.

Read More: Bigg Boss Season 7: అమర్ కి కాంప్లిమెంట్ ఇచ్చిన నాగార్జున..!

టాస్క్ ల విషయంలో కూడా గత సీజన్స్ తో పోలిస్తే, ఈ సీజన్ చాలా బెటర్ అనే చెప్పాలి. గురువారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తిగా సాగింది. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో అమర్ దీప్, రతిక మధ్య మాటల యుద్ధం సాగింది.

- Advertisement -

ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్. టాస్క్ మొదలయ్యే ముందు రెండు టీమ్స్ కోసం సంచులను ఏర్పాటు చేశారు. ముందుగా స్టోర్ రూమ్ కి వెళ్లిన అమర్ అవతలి టీమ్ సంచులను కింద పడేస్తాడు. అప్పుడు రతిక సంచులను ఎందుకు కింద పడేసావని ప్రశ్నించగా నా ఇష్టం , ఇది నా స్ట్రాటజీ అని సమాధానం ఇవ్వటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం స్టార్ట్ అయ్యింది.

Read More: Bigg Boss Season 7: ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఈ ఇద్దరే..!

మాట మాట పెరిగి ఒకరినొకరు తీవ్ర స్థాయిలో తిట్టుకునేవరకు వెళ్లారు. ఈ మొత్తం సీన్లో అమర్ రతిక మీద నోరు జారాడు. ఇందుకు గాను వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున తప్పకుండా అమర్ కి క్లాస్ పీకుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు