Deepika Padukone: నిజంగా దీపిక తల్లి అయ్యేది అప్పుడే..?

Deepika Padukone.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన దీపిక పదుకొనే టాలీవుడ్ లో మొట్టమొదటిగా నటించిన చిత్ర కల్కి2898AD. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో దీపిక పదుకొనే ప్రెగ్నెంట్.. అయినా కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఈమె నటించింది. తన మొదటి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతోంది. 2018 లో స్టార్ హీరో రణవీర్ సింగ్ అని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2024 ఫిబ్రవరి లో తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను ప్రెగ్నెంట్ అయ్యాననే విషయాన్ని అభిమానులతో పంచుకుంది దీపికా పదుకొనే.

Deepika Padukone: Did Deepika really become a mother?
Deepika Padukone: Did Deepika really become a mother?

బేబీ బంప్ విమర్శలకు చెక్..

ఈ విషయం తెలిసిన అభిమానులు, సెలబ్రెటీలు కూడా ఈమెకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు. అయితే తమ బిడ్డ పుట్టకముందే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రాగా.. అందులో భాగంగానే బాలీవుడ్ లో స్టార్ హీరోగా చలామణి అవుతున్న షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలో సుమారు 100 కోట్ల విలువైన ఫ్లాట్ ట్ ను కొనుగోలు చేసి ఆ ఇంటికి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో కూడా దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ పైన పలు రకరకాల రూమర్స్ సైతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొదట ఆమె నిజంగానే తల్లి కాలేదని కేవలం ఒక ఫేక్ న్యూస్ అన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ వీటన్నిటికీ కౌంటర్లు వేస్తూ కల్కి సినిమా సక్సెస్ మీట్ లో బేబీ బంప్ ఫోటోలతో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అలా తనపై వచ్చిన విమర్శలకు తిరిగి సమాధానాన్ని చెప్పింది.

సెప్టెంబర్ 28న డెలివరీ అయ్యే అవకాశాలు..

దీపిక పదుకొనే గత కొద్ది రోజుల క్రితమే డెలివరీ అయ్యిందని ,బాబు పుట్టారనే విధంగా పలు రకాల ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. కానీ ఈ ఫోటోలన్నీ కూడా ఫేక్ అన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి దీపికా పదుకొనే డెలివరీ సమయం దగ్గర పడుతోందని, అందుకే సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చింది. అలాగే తన బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చూసస్తోందట. దీపికా పదుకొనే లండన్ లో డెలివరీ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు బాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28వ తారీఖున ఆమె డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

అతిధి కోసం ఎదురుచూస్తున్న దీపిక – రణబీర్ జంట..

దీపిక డెలివరీ అయిన తర్వాత బిడ్డతో తన లైఫ్ ను కొన్ని నెలల పాటు ఎంజాయ్ చేయాలని భావిస్తోందట . అందుకే ఇప్పటినుంచి ఆమె కొంతమేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే అతిథి కోసం అటు దీపిక రణవీర్ జంట ఇద్దరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం దీపికాకు అందమైన కుమారుడు పుడతారు అంటూ ఉండగా, మరికొంతమంది కూతురు పుడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎవరు పుడతారో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు