Devara: దేవర మూవీకి పోటీగా హాలీవుడ్ మూవీ.. దెబ్బ పడేటట్టు ఉందిగా..?

Devara.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి వారసుడు ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఇప్పుడు వరుస సినిమాలతో ఏకంగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి స్టేటస్ ను దక్కించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుండగా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Devara: Hollywood movie in competition with Devara movie.. seems to be hit..?
Devara: Hollywood movie in competition with Devara movie.. seems to be hit..?

భారీ అంచనాలతో దేవర విడుదలకు సిద్ధం..

భారీ అంచనాల మధ్య ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ , టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)విలన్ గా, బాలీవుడ్ బ్యూటీ అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇదే దూకుడుతో మార్కెట్లోకి వస్తోంది. ఇప్పటికే అన్ని భాషలలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు దేవర సేఫ్ గానే ఉంది. అయితే నార్త్ నుంచి ఇప్పుడు దేవర కి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

దేవర మూవీకి పోటీగా హాలీవుడ్ మూవీ..

అదేమిటంటే అక్టోబర్ 4వ తేదీన హాలీవుడ్ మూవీ జోకర్ 2 (Joker -2) కూడా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. జోకర్ ఫ్రాంచైజీకి ఇండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జోకర్ ఇండియన్ బాక్సాఫీస్ ని వసూళ్లతోనే షేక్ చేసేసింది.అప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా 2019లోనే రూ .70 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అప్పట్నుంచి నార్త్ ఆడియన్స్ లో జోకర్ ఒక బ్రాండ్ గా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జోకర్ -2 ఏకంగా రూ.150 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది.

- Advertisement -

జోకర్ 2 ఎఫెక్ట్ నుంచి దేవర తప్పించుకుంటుందా..

ప్రస్తుతం దేవరపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే దేవరా రిలీజ్ అయ్యి వారం సమీపించే సమయంలోపే.. దేవర సినిమాకి మంచి హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు మొత్తం ఈ సినిమానే రాబట్టేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఒకవేళ జోకర్ 2 హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం దేవర కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి జోకర్ 2 ప్రభావం దేవర సినిమాపై పడకుండా చిత్ర బృందం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందో చూడాలి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు