Devara: నందమూరి ఫ్యామిలీ వార్.. సినిమాపై ఎఫెక్ట్ చూపుతుందా..?

Devara..సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం (Nandamuri family) లో విభేదాలు ఉన్నాయని వార్తలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ మధ్యలో ఒకటైనప్పటికీ ఈ మధ్యకాలంలో నందమూరి కుటుంబం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) అభిమానులు ఒక సైడ్ అయితే మిగిలిన వారంతా కూడా మరొక సైడ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర (Devara)సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

Devara: Will the Nandamuri family war have an effect on the film?
Devara: Will the Nandamuri family war have an effect on the film?

టెన్షన్ లో దేవర సినిమా నిర్మాతలు..

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదలై సక్సెస్ అవుతుందని చాలా ధీమాతో ఉంటున్నారు. కానీ నందమూరి కుటుంబం లో వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల కచ్చితంగా దేవర సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని నందమూరి ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర సినిమాకి ప్రమోషన్స్ చేయలేదు. పైగా పబ్లిసిటీ కూడా చేయలేదు వీటికి తోడు నందమూరి కుటుంబం పక్కన పెట్టిందనే ఎఫెక్ట్ కూడా దేవర సినిమా మీద పడబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద అటు అభిమానులతో పాటు నిర్మాతలు కూడా కాస్త టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం.

నందమూరి కుటుంబం దూరం పెట్టినట్టేనా..

నందమూరి కుటుంబ సభ్యులు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలను సైతం దూరం పెట్టడంతో అభిమానులకు కాస్త నిరాశ కలిగించినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం టిడిపిదే అయినా సినీ సపోర్టు కూడా కావాలనే ఉద్దేశంతో ఉన్నారట.. అందుకే బడా సినిమాలకు సైతం టికెట్ల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి ఇలాంటి సహాయం అందుతుందా లేదా అనే అనుమానాలు కూడా అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..

ఏ చిత్రానికైనా సరే టికెట్ల రేటు పెంపుతో పాటు అదనపు షోలు వేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిందే. గత కొంతకాలంగా సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి మాట పలకరింపు లేవనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజున బాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చే అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ పేరిట హైదరాబాదులో చాలా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం పంపించారు.. కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కి మాత్రమే ఆహ్వానం పంపించలేదనే విధంగా వార్తలైతే ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాకుండా కుటుంబం మొత్తం కూడా బాలయ్య ఇంటి నుంచి ఒక బస్సులో వేడుకకు వెళ్లేలా నందమూరి కుటుంబం ప్లాన్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

బాలయ్య ఈవెంట్.. దేవర మూవీ పై ఎఫెక్ట్ పడనుందా..

వాస్తవానికి ఈ ఈవెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారట.. గతంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ ని అసలు పిలవలేదని, అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమానికి దూరం అవ్వడంలో ఎలాంటి తప్పులేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభావం దేవర సినిమా మీద ఏ విధంగా ప్రభావం చూపుతోందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు