Fastest 100K liked Glimpse : వెనకబడిపోయిన “పుష్ప”రాజ్… ఫస్ట్ ప్లేస్ లో ఎవరంటే?

Fastest 100K liked Glimpse : పాన్ ఇండియా సినిమాల నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్… ఇలాంటి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతుంది అంటే చాలు సినీ ప్రియులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తారు. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం రికార్డులు బ్రేక్ చేసే వ్యూస్ తో చరిత్రను సృష్టించాలని తహతహలాడుతారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మాస్ జాతరకు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ ను టీజర్ ద్వారా రివీల్ చేశారు.

ఈ సందర్భంగా ఇప్పటి వరకు అత్యంత వేగంగా 100k లైక్స్ సొంతం చేసుకున్న గ్లింప్స్ పై ఓ లుక్కేద్దాం. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ వెనకబడిపోయాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “పుష్ప”రాజ్ తాజాగా విడుదలైన టీజర్ తో ఈ అరుదైన ఫీట్ ను అందుకోవడానికి 9 నిముషాలు తీసుకున్నాడు. నిమిషాల వ్యవధి తేడాతోనే అల్లు అర్జున్ మూడవ స్థానంలోకి వెళ్లిపోయారు. మరి మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే?

“దేవర” రికార్డు సేఫ్

తాజాగా రిలీజైన మోస్ట్ అవైటెడ్ టీజర్ “పుష్ప 2” అన్నీ రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చేలా దేవర రికార్డు మాత్రం సేఫ్ గా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర” గ్లింప్స్ మొదటి స్థానంలో ఉంది. కేవలం 5 నిమిషాల్లోనే 100k లైక్స్ ను రిచ్ అయ్యింది “దేవర”. దీంతో మోస్ట్ లైక్డ్ 100K గ్లింప్స్ గా “దేవర” ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

- Advertisement -

ఇక రెండవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “దే కాల్ హిమ్ ఓజీ”నిలిచింది. 7 నిమిషాల్లోనే “ఓజీ” 100k లైక్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా రిలీజైన “పుష్ప 2” టీజర్ కు ఈ ఫీట్ ను చేరుకోవడానికి 9 నిముషాలు పట్టింది. ప్రభాస్ “సలార్”కు 100k లైక్స్ సాధించడానికి 9 నిముషాలు పట్టగా, ఇది మూడవ స్థానంలో ఉంది. దర్శకధీరుడు తెరకెక్కించిన గత చిత్రం “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఈ లిస్ట్ లో చేరడానికి 12 నిమిషాల టైం తీసుకోగా, 5వ స్థానంలో నిలిచింది.

ఫాస్టెస్ట్ 100K లైక్డ్ గ్లింప్స్ లిస్ట్ లో 6వ స్థానంలో ఉంది పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ. ఉస్తాద్ కు ఈ రికార్డు క్రియేట్ చెయ్యడానికి 13 నిమిషాలు పట్టింది. ఇక పవన్ నటించిన మరో మూవీ “భీమ్లా నాయక్” 17 నిమిషాలతో 7వ స్థానంలో ఉంది.

హిస్టరీ క్రియేట్ చేసిన పవన్

ఫాస్టెస్ట్ 100K లైక్డ్ గ్లింప్స్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలతో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 7 నిమిషాతో “ఓజీ”, 13 నిమిషాలతో “ఉస్తాద్ భగత్ సింగ్”, 17 నిమిషాలతో “భీమ్లా నాయక్” ఉండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు