Indian2 collections : ఇదేం వర్కౌట్ అయ్యేలా లేదు… వదిలెయ్యండమే మంచి ఆప్షన్

Indian2 Collections : కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్2 సినిమా ఎట్టకేలకు జులై 12న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాపై ముందునుండే ప్రేక్షకుల్లో కాస్త తక్కువ అంచనాలే ఉండగా, ట్రైలర్ తో ఆసక్తి పెరిగింది. కానీ థియేటర్లలో ఇండియన్ తాతని చుసిన ప్రేక్షకులు విసుగు చెందారు. ల్యాగ్ ఎక్కువైందని బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగదీశారని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే కాంబో హైప్ వల్ల ఈ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తొలిరోజు బాగానే వచ్చారు. సినిమాకి ఆశించినంత రెస్పాన్స్ మాత్రం థియేటర్ల వద్ద రాలేదు. అభిమానులే ఈ సినిమాని రిజెక్ట్ చేయగా, ఇక అంతా కామన్ ఆడియన్స్ చేతిలోనే ఉందని చెప్పాలి. తొలిరోజు సాయంత్రానికి ఫైనల్ గా బీలో యావరేజ్ అన్న టాక్ రావడంతో ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ అనిపించుకుంది.

Indian2 second day collections update

రెండో రోజు బయ్యర్లు కూడా షాక్…

ఇక భారతీయుడు2 సినిమాకి టాక్ ఎలా ఉన్నా కాంబో హైప్ వల్ల ఫస్ట్ డే పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి 58 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తెలుగు లో ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు రాబట్టడం విశేషం. అయితే రెండో రోజు వీకెండ్ కాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందని బయ్యర్లు భావించారు. కానీ ప్రేక్షకులు మాత్రం దెబ్బేసారు. ఆన్లైన్ బుకింగ్స్ ప్రకారం రెండో రోజు ఓపెనింగ్స్ కూడా ఆశించినంత లేవు. ఆన్లైన్ బుకింగ్స్ పది కోట్ల లోపే ఉండగా, ఆఫ్ లైన్ లోనే ఎక్కువ టికెట్లు తెగగా, ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రెండో రోజు 28 నుండి 32 కోట్ల కి అటు ఇటుగా గ్రాస్ వసూళ్లు ఉండొచ్చని తెలుస్తుంది. అయితే సినిమా బిజినెస్ తో పోలిస్తే ఇండియన్2 (Indian2 collections) చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఏది ఏమైనా ఫస్ట్ డే నిర్మాతలకి షాకిస్తే రెండో రోజు బయ్యర్లకు షాకిచ్చింది సినిమా.

- Advertisement -

20 నిముషాలు ట్రిమ్ చేసిన మేకర్స్…

ఇక ఇండియన్2 సినిమాకి ఇంత నెగిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం బోరింగ్ స్క్రీన్ ప్లే, అలాగే ల్యాగ్ ఎక్కువ కావడమే అని చెప్పొచ్చు. అయితే మిస్టేక్స్ తెలుసుకున్న మేకర్స్ సినిమాలో అనవసర సన్నివేశాలు అన్ని కలిపి ఏకంగా 20 నిమిషాల పాటు ట్రిమ్ చేస్తున్నారట. అయితే వీకెండ్ లో వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చినా కొంతమేర సేఫ్ అయినట్టే. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్ లో సినిమాని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇక ఇండియన్2 వీకెండ్ లో వంద కోట్ల వరకు గ్రాస్ అందుకోవచ్చని అంచనా. కానీ బ్రేక్ ఈవెన్ మాత్రం ఇక అవ్వడం కుదరదని బుకింగ్స్ తో తెలిసిపోతుంది. నెటిజన్లు అయితే ఈ వారం ఆప్షన్ లో ఇండియన్2 ని వదిలేసి మళ్ళీ కల్కి చూసేయమని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు