kalki 2898AD Review : “కల్కి” మూవీ ఫైనల్ రివ్యూ

kalki 2898AD Review : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనె నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898AD ‘ .. ప్రస్తుత ఈ మూవీ మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.. నాగ్ అశ్విన్ అనుకున్న దానికన్నా అద్భుతంగా సీన్లు ఉన్నాయనే టాక్ ను అందుకుంది.. మరి సినిమా కథ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

కథ : ‘మహాభారతం’ లోని పాత్రలు గురించి తెలిసిన వారికి ఇంకా బాగా అర్ధమవుతుంది ఈ సినిమా. కురుక్షేత్రంలో పాండవుల వంశాన్ని నాశనం చేసిన అశ్వద్ధామని(అమితాబ్ బచ్చన్) కృష్ణుడు ఎందుకు శపించాడు? అతనికి మరణం రాకుండా కలియుగంలో ఘోరాలన్నీ చూసేలా ఎందుకు చేశాడు అనేది..? చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కురుక్షేత్రం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత… ఈ భూమి ఎలా అంతరించి పోతుంది? ఆ సమయంలో జనాలంతా భూమ్మీద మొదటి నగరం అయిన కాశీకి వెళ్లిపోతుంటారు. అక్కడ ఓ కాంప్లెక్స్ ఉంటుంది. మంచి నీళ్లు, ఆహారం దొరుకుతుంది. అలాంటి చోటుకి వెళ్లాలనేది భైరవ (ప్రభాస్) లక్ష్యం. ఇందుకు బుజ్జి సలహాలతో బౌంటీస్ హంటింగ్ చేస్తుంటాడు. భవిష్యత్తులో డబ్బు యూనిట్స్ రూపంలో ఉంటుందట. కాబట్టి భైరవ అలా 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ కి వెళ్లిపోవాలని అందరితోనూ ఫైట్ చేస్తుంటాడు. మరోపక్క కాంప్లెక్స్ లో అమ్మాయిలు కృత్రిమంగా గర్భం ధరించేలా ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయిల గర్భాన్ని కరిగించి సీరంని తీస్తుంటారు. దానిని సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కి ఇస్తుంటారు. దానిని ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు అతనికి లైఫ్ టైంతో పాటు శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అలా అతను అమరత్వం పొందాలనుకుంటాడు. ఈ క్రమంలో సుమతి (దీపికా పదుకోన్) కూడా గర్భం దాల్చి 150 రోజుల పాటు శిశువుని మోస్తున్నట్టు కాంప్లెక్స్ టీంకి తెలుస్తుంది. ఆమె గర్భాన్ని కూడా కరిగించి సీరంని సేకరించాలని ప్రయత్నించిన సుప్రీమ్ టీమ్ కి పెద్ద షాక్ తగులుతుంది. ఆమె సీరంని సేకరిస్తున్న టైంలో మిషన్ పాడవుతుంది. కాంప్లెక్స్ లో కూడా ఏదో తెలీని అలజడి మొదలవుతుంది? మరోపక్క శంభల ప్రజలు అలాగే అశ్వద్ధామ .. సుమతిని ఆమె కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు? మరోవైపు సుప్రీమ్ గ్యాంగ్ తో చేతులు కలిపి సుమతిని తీసుకొచ్చి అప్పగిస్తానని భైరవ.. శంభలకి వెళ్తాడు. ఆ తర్వాత భైరవకి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి.అవి ఏంటి? అసలు భైరవ ఎవరు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ‘కల్కి 2898 ad’ చూడాల్సిందే.

విశ్లేషణ : ‘కల్కి 2898 ad ‘ ప్రాజెక్టు మొదలువుతుంది అన్నప్పుడే అందరిలో ఎన్నో అనుమానాలు పుట్టుకొచ్చాయి. 2 క్లాస్ సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ రూ.500 కోట్ల బడ్జెట్ తో.. అదీ ప్రభాస్ తో.. అంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలడా? సరైన ఔట్పుట్ ఇవ్వగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అన్నీ ఎలా ఉన్నా సినిమాలో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ ఉంటాయా? అనేది కూడా పెద్ద సస్పెన్స్ గా మారింది. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ.. ‘కల్కి..’ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. సినిమా చూస్తున్నంత సేపు .. ఇది తెలుగు సినిమానా? తెలుగు సినిమాలో ఇంత అద్భుతమైన విజువల్స్ చూస్తున్నామా? అని అందరూ సంబ్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతారు అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ పాసబుల్ గా అనిపిస్తుంది. ప్రభాస్ ఎంట్రీ 25 నిమిషాలకి గాని రాదు. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ భలేగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద అమితాబ్ పాత్ర ఎంట్రీ ‘అఖండ’ లో పెద్ద బాలకృష్ణ అయిన అఘోర పాత్రని గుర్తుచేస్తుంది. ఇక సెకండాఫ్ లో కొన్ని లెంగ్త్ ఉన్న సీన్లు ఉన్నాయి. కానీ బ్యాక్ టు బ్యాక్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.ఈ ఏడాది వచ్చిన ‘హనుమాన్’ క్లైమాక్స్ గురించి చాలా మంది ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. డౌట్ లేకుండా ‘కల్కి 2898 ad ‘ క్లైమాక్స్ దానికి డబుల్ ఉంటుంది. సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. టెక్నికల్ టీంకి ఫుల్ మర్క్స్ వేసేయొచ్చు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. ప్రభాస్ తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ లో అలరించాడు. అయితే 3 గంటల సినిమాలో ప్రభాస్ గంటన్నర మాత్రమే కనిపిస్తాడు. అది కూడా అభిమానులకి లోటు అని అనిపించదు. దీపికా పదుకోనె పాత్ర హీరోయిన్ అని చెప్పలేం కానీ.. కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్రకి ఇచ్చిన ప్రాముఖ్యత బాగుంది. అమితాబ్ బచ్చన్ అదరగొట్టేసాడు. ఓ రకంగా ప్రభాస్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నాడు. ‘బాహుబలి’ లో కట్టప్ప తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాలు ఓన్ చేసుకునే పాత్ర అవుతుంది ఈ అశ్వద్ధామ పాత్ర అనడంలో సందేహం లేదు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాంగోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్,మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, దిశా పటాని..ల అతిధి పాత్రలు మెప్పిస్తాయి. కమల్ హాసన్ కనిపించేది కాసేపే అయినా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడానికి బాగా కలిసొచ్చింది. కమల్ నటన గురించి ఇక కొత్తగా చెప్పేది ఏముంది. ఎప్పటిలానే అదరగొట్టేశాడు. బ్రహ్మానందం పాత్ర సో సోగా అనిపిస్తుంది. శోభన రీ ఎంట్రీకి మంచి రోల్ పడింది.

ప్లస్ పాయింట్స్ :

కథ
విజువల్ ఎఫెక్ట్స్
ప్రభాస్
సెకండాఫ్
క్యాస్టింగ్

మైనస్ పాయింట్స్ :

కొన్ని లెంతీ సీన్లు

చివరిగా.. ‘కల్కి 2898 ad ‘ ఓ మంచి ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే మైథలాజికల్ ఎలిమెంట్స్, చిన్న పిల్లని ఆకట్టుకునే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. దాదాపు 3 నెలలుగా సరైన సినిమా లేక అల్లాడుతున్న బాక్సాఫీస్ దాహం తీర్చే సత్తా కూడా ఈ సినిమాకి ఉంది.

రేటింగ్ : 3 /5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు