Life style: 30 ఏళ్ల వయసులో అంగీకరించాల్సిన చేదు నిజాలు ఇవే!

30లలోకి అడుగు పెడుతున్నారా? అయితే ఈ సమయంలోనే కొన్ని ముఖ్యమైన వాస్తవాలను మీరు అంగీకరించాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక, ఫ్రెండ్షిప్ లో మార్పులు, సహజ వృద్ధాప్యం వంటి వాస్తవాలను స్వీకరించడం ద్వారా 30 ఏళ్లలోకి ప్రవేశించే వ్యక్తులు రాబోయే దశాబ్దానికి ముందే ప్రిపేర్ అవ్వగలుగుతారు. లేదంటే ముందు ముందు జరగబోయే మార్పులతో ఇబ్బంది పడతారు. 30 ఏళ్లలోకి అడుగు పెట్టడం అంటే సక్సెస్ ఫుల్ లైఫ్ గురించి ఇప్పటిదాకా మీరు కన్న ఊహలను వదిలించుకోవడం, మెచ్యూర్ గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. మరి ఇంతకీ 30 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్న వాళ్లు అంగీకరించాల్సిన చేదు నిజాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే…

1. ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అనే విషయాన్ని అంగీకరించండి. రాత్రికి రాత్రే ఎవరూ ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వలేరు. కాబట్టి కాస్త నిదానంగా ఆలోచిస్తూ సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా అంటే ఎవరితోనో పోల్చుకుని వాళ్ళలా బతకాలని ఆలోచనను పక్కనపెట్టి మీ విలువలకు అనుగుణంగా బడ్జెట్ ను ప్లాన్ చేసుకోండి. ఇప్పటినుంచి అయినా మీకు వస్తున్న జీతంలో ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన పెట్టుబడులు పెట్టండి. అలాగే మంచి సాలరీ పొందడానికి అవసరమైన స్కిల్స్, డిగ్రీలు సంపాదించడంపై దృష్టి పెట్టండి.

2. ఏజ్ 30లో అడుగు పెట్టేవాళ్ళు ఎదుర్కొనే మరో సమస్య ఏమిటంటే స్నేహితులు మారడం. ఈ ఏజ్ లో కొత్త ఉద్యోగాల కోసం మకాం మార్చడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం లాంటి కారణాల వల్ల సర్కిల్ మారుతూ ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా ఉన్న స్నేహితులను వదిలేయాల్సి రావడంతో పాటు కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి. కాబట్టి పాత ఫ్రెండ్స్ ని వదిలేసినందుకు బాధపడడం మానేసి కొత్త వారితో కలిసిపోవడం గురించి ఆలోచించండి.

- Advertisement -

3. సహజ వృద్ధాప్యం అనివార్యం అనే విషయాన్ని కూడా అంగీకరించాలి. 30 ఏళ్లకు ముందు, ఆ తర్వాత డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. బొద్దుగా అవ్వడం, వెంట్రుకలు బూడిదల రంగులోకి మారడం, చర్మంపై ముడతలు వంటివి కనిపిస్తాయి. ఈ విషయాల గురించి బాధపడే బదులు సరైన నిద్ర, పోషణ, వ్యాయామం వంటి వాటిపై దృష్టి పెట్టి లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

4. పర్సనల్ ఫుల్ ఫిల్మెంట్ ఆశయం నుంచి బ్యాలెన్స్ కి మారుతుంది. సాధారణంగా 30 ఏళ్లలోకి అడుగు పెట్టిన వాళ్లకు సక్సెస్ ఫుల్, సంతృప్తికరమైన జీవితం అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచనలో పడతారు. 20 ఏళ్లలో ఉన్నప్పుడు కెరియర్, స్కిల్స్ అంటూ జీవితంలో నిలదొక్కుకోవడానికి పరుగులు తీస్తారు. 30 ఏళ్లలోకి అడుగు పెట్టే నాటికి జీవితం అంటే ఏంటి? అనే ప్రశ్న తలెత్తుతుంది. డిగ్రీలు, అవార్డులు, వంటి వాటికి మించి ఆరోగ్యం, అనుభవాలు, సంబంధాలు వంటి విలువైన ఆస్తులను మీరు మూటగట్టుకున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు