Lifestyle : ఇలాంటి పనులు చేసే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ నాశనం… మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు?

ఫ్రెండ్షిప్ అనేది మనసుల మధ్య ఉన్న గొప్ప బంధం. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆపదలో ఉన్నా… అన్ని సమయాల్లో తోడుగా ఉండేవాడే స్నేహితుడు. అయితే ఫ్రెండ్షిప్ కి కూడా అన్ని సంబంధాలలాగే కొన్ని రూల్స్ ఉంటాయి. లేదంటే కొన్ని రకాల అలవాట్లు ఉన్న వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ నాశనం అవుతుంది. పురాతన ఫిలాసఫీ స్టోయిసిజంలో ఎలాంటి వారితో స్నేహం చేస్తే నైతికంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము అనే విషయాన్ని వెల్లడించారు. అలాగే చెడు ఆలోచనలు, అహంకారం, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే దోస్తులతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్లు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇందులో చెప్పుకొచ్చారు. ఎవరితోనైనా సాన్నిహిత్యం పెంచుకొని, వారిపై నమ్మకాన్ని పెట్టుకునే ముందు వాళ్లతో స్నేహం ఎంత వరకు విలువైనది అనే విషయాన్ని ముందుగానే ఆలోచించుకోవాలి. మంచి ఉద్దేశంతో కూడిన స్నేహాన్ని కూడా దెబ్బతీసే కొన్ని రకాల మనస్తత్వం ఉన్న స్నేహితులను మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తీసేసినప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరి లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి మనస్తత్వం ఉన్న ఫ్రెండ్స్ ను దూరం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. టూ ఫేస్డ్ ఫ్రెండ్స్
ద్వంద్వ వైఖరి ఉండే మనుషులు మోసపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే నిజాలను దాచిపెట్టి, ఏదైనా తప్పు జరిగితే బాధ్యత వహించకుండా సాకులతో తమను తాము సమర్ధించుకుంటారు. మీ విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు. ఇక ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు మీరు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా మాట్లాడుతూ ఉంటారు.

2. మోరల్లీ కాంప్రమైజ్డ్ ఫ్రెండ్స్
నైతికంగా రాజీ పడిన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. గౌరవప్రదంగా బతకడానికి బదులుగా మిమ్మల్ని తప్పుదారులు ఎంచుకునేలా చేస్తారు. మిమ్మల్ని అమాయకులు అంటూ మీ ద్వారా పనులు చేయించుకుని తమ వ్యక్తిగత లాభాన్ని చూసుకుంటారు.

- Advertisement -

3. నిర్లక్ష్యం చేసే స్నేహితులు
నమ్మకం అనేది స్నేహానికి పునాది లాంటిది. కానీ కొంతమంది స్నేహితులు కేవలం తమ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ మీకేదన్నా అవసరం పడినప్పుడు మాత్రం అనవసరమైన సాకులు చెబుతూ, మీకు ఏ రకంగానూ సహాయం చేయరు. అలా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మీకు అవసరమైనప్పుడు పదేపదే గైర్హాజరు అవుతూ ఉంటారు.

4. కఠినంగా విమర్శించే స్నేహితులు
అవసరమైన విషయాల్లో స్నేహితుల అభిప్రాయాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో మీ లోపాలను ఎత్తి చూపుతూ, మిమ్మల్ని కించపరుస్తూ, మీ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసే కామెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారిని పొరపాటున కూడా మీ ఫ్రెండ్స్ లిస్టులో ఉంచుకోకండి.

5. అహంకారం ఉండే ఫ్రెండ్స్
నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడూ ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. వాళ్ళ బౌండరీస్ ఏంటో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అహంభావంతో విర్రవీగే స్నేహితులు వాస్తవాలకు దూరంగా, ఊహల్లో తేలుతూ ఉంటారు. తమ తప్పులను ఒప్పుకోకుండా అవతలి వారి ఒపీనియన్ ను తక్కువ చేస్తారు.

ఇలాంటి అలవాట్లతో పాటు నెగెటివిటీ ఉండే ఫ్రెండ్స్, నిరాశవాదులు, ఉదాసీనంగా ఎప్పుడూ అసంతృప్తితో ఉండే ఫ్రెండ్స్ ను వెంటనే మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేసేయండి. ఇలాంటి వారి వల్ల మీపై నెగటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ లో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అనేది చెక్ చేసుకుని, పాజిటివ్ మైండ్ సెట్ తో లైఫ్ లో ప్రశాంతంగా గడపండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు