Love Me Movie Box Office : థియేట్రికల్ రన్ ఫెయిల్… ఎఫెక్ట్ అక్కడ పడింది

తెలుగు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ కి కష్టాలు తప్పట్లేదు. కెరీర్ మొదటి నుంచి స్టార్ గా నిలదొక్కుకోవాలని కష్టపడుతున్న ఈ యంగ్ హీరో తాజాగా లవ్ మీ అనే హారర్ లవ్ స్టోరీ తో థియేటర్లలోకి వచ్చాడు. కానీ ఈ మూవీకి ఆశించిన ఫలితం దక్కలేదు. అసలే ఈ మూవీ తీవ్ర నష్టాల్లో ఉంటే మరోవైపు శాటిలైట్ డీల్స్ విషయంలో మరో దెబ్బ పడినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీకి వచ్చిన సమస్య ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

థియేట్రికల్ రన్ ఫెయిల్… ఎఫెక్ట్ అక్కడ పడింది

వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా నటించిన హర్రర్ మూవీ లవ్ మీ. కిరణ్ భీమవరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ థ్రిల్లర్ మూవీని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హర్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఏకంగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఎలాగైనా ఈ మూవీతో కెరీర్ లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు ఆశిష్. అందుకే చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హారర్ మూవీతో ప్రయత్నం చేశాడు.

Love Me' sets a release date in April | Telugu Cinema

- Advertisement -

లవ్ మీ మూవీ ఫస్ట్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి బజ్ తో బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ 6 కోట్లు జరిగింది. అంటే ఆశిష్ స్థాయికి మించిన బిజినెస్ జరిగింది. అలాగే డిజిటల్ గా 5 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ థియేటర్లలో ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన విధంగా ఆడలేదు. మొత్తంగా ఈ మూవీ థియేటట్రికల్ రికవరీ కేవలం 2 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

మరో సమస్య

అసలే ఈ మూవీ ఆశించిన విధంగా ఆడలేదు అనుకుంటుంటే నిర్మాతలకు మరింత నిరాశను కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మూవీకి ఇప్పుడున్న సమస్య ఏమిటంటే ఈ మూవీ శాటిలైట్ డీల్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. థియేటర్లలో లవ్ మీ మూవీకి దారుణమైన రెస్పాన్స్ రావడంతో శాటిలైట్ డీల్స్ కుదుర్చుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శాటిలైట్ డీల్ సమస్యను ఎలా అధిగమిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికంటే ముందే థియేట్రికల్ బిజినెస్ తో పాటు డిజిటల్, శాటిలైట్ డీల్స్ పూర్తి చేసుకుంటేనే నిర్మాతలు కొంతవరకు సేఫ్ అవుతారు. థియేటర్లలోకి వచ్చాక ఆ మూవీకి దారుణమైన రెస్పాన్స్ వస్తే డిజిటల్ డీల్స్, శాటిలైట్ డీల్స్ కుదరడం అన్నది చాలా కష్టమైన పని. మరి ఈ పరిస్థితిని నిర్మాత దిల్ రాజు ఎలా చక్కబెడతాడో చూడాలి. ఇక ఎప్పటిలాగే హీరో ఆశిష్ కి ఈ మూవీతో నిరాశ తప్పలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు