Maharaja First Review : మహరాజా ఫస్ట్ రివ్యూ

Maharaja First Review : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ మహారాజా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో సరికొత్త అవతార్ లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేశాడు విజయ్ సేతుపతి. ఈ మూవీ జూన్ 14న థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. అయితే జూన్ 12న సినీ ప్రముఖుల కోసం ఈ తమిళ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలు వేశారు. ఈ నేపథ్యంలోని సినిమా ఎలా ఉంది అనే టాక్ బయటకు వచ్చింది. మరి విజయ్ సేతుపతి 50వ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

మహారాజా ఫస్ట్ రివ్యూ

విజయ్ సేతుపతితో పాటు, మమతా మోహన్‌దాస్, అభిరామి, అనురాగ్ కశ్యప్ , భారతిరాజా, మునిష్కాంత్ ఇతర నటీనటులు యాక్షన్ చిత్రం మహారాజాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందించారు. దినేష్ పురుషోత్తమన్ కెమెరాను ఆపరేట్ చేయగా, విక్రమ్, లియో చిత్రాలకు పని చేసిన ఫిలోమిన్ రాజ్ ఈ చిత్రానికి ఎడిటింగ్‌ చేశారు.

Vijay Sethupathi's Maharaja Release Date Confirmed

- Advertisement -

మహారాజా మూవీని చూసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహారాజా తమిళ చిత్ర పరిశ్రమలో మరో జెమ్ అని అంటున్నారు. అంతేకాకుండా క్లాస్ అండ్ మాస్ రెండింటిని మిక్స్ చేసి డైరెక్టర్ నితిలన్ అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే టెక్నికల్ టీం కూడా తమ వంతు కృషి చేసింది అంటూ మెచ్చుకుంటున్నారు. గాడమైన విషాదం, ఉల్లాసపరిచే అద్భుతమైన క్షణాలతో పాటు తీవ్రమైన ఉత్కంఠ వంటి అంశాలతో ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి కెరీర్లో ఆయన 50వ చిత్రం మర్చిపోలేని మైల్ స్టోన్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహారాజా ప్లస్ పాయింట్స్

ఓవరాల్ గా మూవీ బాగుంది అంటూ గుడ్ రివ్యూస్ అందుకుంటున్న మహారాజా సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే నుంచి మొదలుకొని టేకింగ్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు. అలాగే గూస్ బంప్స్ తెప్పించే బిజిఎం, సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే సస్పెన్స్, హీరో విజయ్ సేతుపతి పర్ఫామెన్స్ సినిమాలో మెయిన్ హైలెట్ అని చెప్పుకొస్తున్నారు. రిలీజ్ కి ముందే ఇంతటి పాజిటివ్ టాక్ రావడం చూస్తుంటే మహారాజా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అనిపిస్తుంది. అయితే ఈ రివ్యూలే ఫైనల్ వర్డిక్ట్ కాదు. స్పెషల్ షోల టాక్ ఎలా ఉన్నా ప్రేక్షకుల తీర్పు మాత్రమే ఫైనల్ కాబట్టి ఈ మూవీకి జూన్ 14 న థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కాగా ఈ రివ్యూలు చూశాక మహారాజా మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు విజయ్ సేతుపతి అభిమానులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు