SSMB29 : అందరి కళ్ళు దీనిపైనే.. స్పెషల్ డే కి క్రేజీ అప్డేట్?

SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. చూడ్డానికి హాలీవుడ్ రేంజ్ లో ఉండే మహేష్ బాబు బాలీవుడ్ లో ఎన్ని భారీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. కానీ ఇప్పుడు రాజమౌళి తో పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేయబోతున్నాడు. కనీవినీ ఎరగని తీరులో ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమా స్టార్ట్ చేయకపోయినా, రాజమౌళి మాత్రం ఆరు నెలల నుండి సినిమాపై ఫోకస్ పెట్టగా, గుంటూరు కారం రిలీజ్ కాగానే మహేష్ ని లుక్స్ పరంగా దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ని పెట్టి, డిజైన్ చేయించగా, మహేష్ బాబు ని సినిమా లుక్స్ కోసం కొన్నాళ్ళు అఫ్ లైన్ లో కూడా కనబడకుండా చేసాడు రాజమౌళి. రీసెంట్ గా మహేష్ బాబు ఫస్ట్ టైం కాస్త ఎక్కువ గడ్డంతో, లాంగ్ హెయిర్ కట్ తో కనిపించేసరికి జక్కన్న సినిమా కోసమే అని తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న ఉన్న సందర్బంగా మహేష్ బాబు రాజమౌళి  (SSMB29)సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వస్తుందని సమాచారం వచ్చింది.

Mahesh Babu SSMB29 Update on Superstar Krishna Jayanti

మహేష్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. ఇక సినిమా మొదలు?

ఇక తాజాగా మహేష్ బాబు SSMB29 కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇక ఫిల్మీఫై కి అందిన సమాచారం ప్రకారం రేపు (మే31) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా మహేష్ రాజమౌళి సినిమా నుండి కీలక అప్డేట్ రానుంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం చేస్తున్నారని, కానీ అందిన అప్‌డేట్ ప్రకారం అన్ అఫిషియల్ గా రేపటి నుండే షూటింగ్ ని ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది. ఆ షూటింగ్ లో రాజమౌళి మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి సంబంధించి కొన్ని టెస్ట్స్ చేసి, సినిమాలో లుక్ ని ఫైనల్ చేస్తారని టాక్. కెరీర్ లో ఇప్పటివరకు మహేష్ ని ఎప్పుడూ అలా చూసి ఉండరట. ఆ రేంజ్ లో రాజమౌళి మహేష్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

- Advertisement -

అనౌన్స్ మెంట్ వస్తుందా?

అయితే రాజమౌళి తో మహేష్ బాబు సినిమా షూటింగ్ పై అప్డేట్ రావచ్చు గాని, సినిమా టైటిల్ గాని, ఫస్ట్ లుక్ గాని ఎలాంటి అప్డేట్స్ ఉండవని తెలుస్తుంది. అయితే మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ రావొచ్చని రేపు అనౌన్స్ మెంట్ అప్డేట్ రావొచ్చు. అయితే ఆ మధ్య RRR టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చినట్టు ఎలాంటి వీడియో ను ఎక్స్పెక్ట్ చేయొద్దని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. బహుశా మహేష్ బాబు బర్త్ డే కి అలాంటి వీడియోలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మహేష్ బాబు SSMB29 ని శ్రీ దుర్గ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో K.L.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలు, టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మరి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా రాజమౌళి టీం ఎలాంటి సప్రైజ్ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు