Mrunal Thakur: ఎట్టకేలకు ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.. ట్విట్టర్ పోస్ట్ వైరల్..!

Mrunal Thakur..తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారి సీతారామం అనే చిత్రం ద్వారా పరిచయమైంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన అందంతో , అభినయంతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత అటు బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండీగా నిలుస్తూ ఉంటుంది మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur: Mrunal Thakur finally fell in love.. Twitter post goes viral..!
Mrunal Thakur: Mrunal Thakur finally fell in love.. Twitter post goes viral..!

లవ్ ఎమోజీ నీ షేర్ చేసిన మృణాల్..

తాజాగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)కు సంబంధించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ నుంచి లవ్ సింబల్ ని షేర్ చేయగా అభిమానులు మృణాల్ ఠాగూర్ ప్రేమలో పడిందా ..? అందుకే ఇలా సింబల్ ని పోస్ట్ చేసింది అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక తెలుగు హీరోతో డేటింగ్ లో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ రూమర్సే అయినప్పటికీ ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ నుంచి లవ్ సింబల్ ని షేర్ చేయగా తాను లవ్ లో ఉన్నట్లుగా లవ్ సింబల్ పెట్టి మరీ హింట్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మృణాల్ ప్రేమలో పడిందా..?

మృణాల్ ఠాకూర్ ఎవరితో ప్రేమలో పడింది ? ఆ హీరో ఎవరు? ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తా? కాదా? అనే విషయాలపైన అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లవ్ సింబల్ ప్రేమ వ్యవహారమా లేకపోతే మరేదైనా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఈ లవ్ సింబల్ విషయం వైరల్ గా మారుతున్నది.

- Advertisement -

మృణాల్ సినిమా కెరియర్..

ఇకపోతే మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే లవ్ కాన్సెప్ట్ తో రాబోతున్న నేపథ్యంలో ఇందులో కూడా మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఎందుకంటే గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో సీత పాత్రలో చాలా అద్భుతంగా నటించింది మృణాల్.అందుకే ఇప్పుడు ప్రభాస (PRABHAS)సరసన కూడా ఈమెను నటింపచేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది మృణాల్. అందరికీ క్షమాపణలు. మీ అంచనాలను నేను అందుకోలేకపోయాను. హను రాఘవపూడి , ప్రభాస్ సినిమాలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో ఈమె నటిస్తే ప్రభాస్ కి జోడిగా చాలా బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందులో తాను నటించడం లేదు అని మృణాల్ చెబుతోంది. అయితే అభిమానులు మాత్రం ఈమెను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందానికి సజెస్ట్ చేస్తున్నారు. మరి చిత్ర బృందం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు